నివర్ తుఫాను కారణంగా ఒక వైసిపి పార్టీ నేత వినయ్ రెడ్డి మృత్యువాత పడ్డారు..ఇది చాలా అమానుషమైన  ఘటన మరి కొన్ని ఘట్టాల్లో భార్య పిల్లలతో గడపవలసి అతడు నది ప్రవాహం లో కొట్టుకుపోవడం నిజంగా బాధాకరం ..  
నిన్నరాత్రి  కారులో కాణిపాకం దగ్గర్లోని తన అత్తగారింటికి వెళ్తున్న సమయంలో దగ్గర్లోని గార్గేయ నది  తుఫాన్ కారణంగా ఉధృతంగా ప్రవహిస్తుంది..

తన అత్తవారింటికి వెళ్తున్న క్రమంలో ఐరాల సమీపంలో రోడ్డు మీదుగా ఉదృతంగా ప్రవహిస్తున్న గార్గేయ నది ని దాటే ప్రయత్నంలో వినయ్ రెడ్డి  ప్రవహిస్తున్న కారు ఆ నదిలో కొట్టుకుపోయింది ..  కొన్ని మీటర్ల దూరం వరకు కొట్టుకు పోయిన వినయ్ రెడ్డి కారులోనే ఉండగానే మరణించారు.. ఈరోజు  ఉదయం కొట్టుకు వస్తున్న కారుని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకి  సమాచారం అందించడంతో వాళ్ళు  అక్కడికి చేరుకున్నారు..

స్థానికుల సహాయం తో  కారుని బయటికి తీశారు ..  అందులోని మృతుడుని గమనించగా  వైయస్సార్ సిపి  నాయకుడిగా గుర్తించారు... వెంటనే స్థానిక ఎమ్మెల్యే కు సమాచారం అందించగా హుటాహుటిన సంఘటన స్థలానికి అయన  చేరుకున్నారు..  మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి  ఓదార్చారు..  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..  అనంతరం పార్టీ నాయకులు గ్రామస్తుల నివాళి ల నడుమ వినయ్ రెడ్డి  అంత్యక్రియలను నిర్వహించారు.. వినయ్ రెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఈ  ఘటనపై ఐరాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

అతని కుటుంబానికి ప్రభుత్వం తరపు ఎమ్మెల్యే 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు .. అంతేకాదు మృతుని భార్య కి వితంతు పింఛన్ మంజూరు చేయడంతో పాటు పిల్లల చదువులు వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే వారికీ భరోసా ఇచ్చారు ..

 గత కొన్ని రోజులుగా ఏపీ ప్రజల్ని నివర్  తుఫాను భయబ్రాంతులకు గురి చేసింది..  ఈ నేపథ్యంలో తుఫాను కారణంగా  కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి.. భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి ..  రోడ్డుపై నుంచి కూడా ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తుంది .. ఇలా రోడ్డు పై నుండి నీరు ప్రవహించడం  ప్రభావం కారణంగా అటుగా వెళ్లే వాహనాలు ఈ నీటిలో నుంచే ప్రమాదకరంగా దాటుతున్నారు ..  నీటి ప్రవాహానికి తట్టుకోలేని కొన్ని వాహనాలు ఆ నీటితో సహా కొట్టుకుపోతున్నాయి అలా కొట్టుకుపోయి చాలా మంది  ప్రాణాలు కూడా వదులుకున్నారు .. 

మరింత సమాచారం తెలుసుకోండి: