ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా భారీగా వార్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వర్షం అస్సలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. తుఫాన్ కారణంగా.. వర్షంలో పూతలపట్టు మండలం పాలకూరుకు చెందిన వైసీపీ నేత వినయ్‌ రెడ్డి కాణిపాకం నుంచి ఐరాలకు కారులో వెళ్తుండగా వాగులో కొట్టుకుపోయారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా ఆయన చనిపోయారు.. కారులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు.ఈ నేపథ్యంలో వినయ్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండగా నిలిచారు.వారికి అండగా భరోసాగా ఆ కుటుంబానికి రూ.11 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.


వినయ్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వినయ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు చెవిరెడ్డి. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి శ్రమించారని.. పార్టీ జెండా మోశారని, ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జైలుకు సైతం వెళ్ళారన్నారు. వినయ్ రెడ్డి తనకు అత్యంత ఆత్మీయుడని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆయనకు ఇద్దరు చిన్న పిల్లల కావడంతో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు. దహన క్రియలు, కర్మక్రియలకు రూ.1 లక్ష.. పిల్లల కోసం ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ. 10 లక్షలు అందించారు.చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి..

మూడు రోజులుగా నలుగురు చనిపోయారు. వాగులు దాటేందుకు ప్రయత్నించి కొంతమంది గల్లంతయ్యారు. ఐరాల మండలంలో కూడా ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. ఇలా చిత్తూరు పరిస్థితి చాలా దయనీయంగా వుంది. అటు ఆంధ్ర ప్రదేశ్ లోని మిగతా జిల్లాలకు కూడా రానున్న రోజుల్లో తూఫాను ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది..ఇలాంటి మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: