మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు హాయాంలో జరిగిన విధంగానే మళ్ళీ పోలవరం  పనులు యధావిధిగా జరుగుతున్నాయి అని ఆయన అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పోలవరం పర్యటన ను అడ్డుకోవటం చాలా తప్పు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. పోలీసులు కేవలం హౌస్ అరెస్టు లకు పరిమితం కావడం వల్ల నేరాలు పెరుగుతున్నాయి అని మండిపడ్డారు. పోలవరం పై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలి అని డిమాండ్ చేసారు.

2017 క్యాబినెట్ నోట్ లో ఏముందో నేను అప్పుడే బయట పెట్టాను అని, కేంద్ర ప్రభుత్వం ఏపీ కు పోలవరం ప్రాజెక్టు  అప్పగించటం పై స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్టు పై ఏపీ ప్రభుత్వానికి అవమానం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది అన్నారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిదులు కేంద్రమే ఇవ్వాలన్నదె పార్లమెంట్ లో చేసిన చట్టం అని ఆయన వెల్లడించారు. కేసులు గురించి చంద్రబాబు, జగన్ లు ఒకరి పై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయం లో వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరి ఏంటో జగన్ చెప్పాలి అని డిమాండ్ చేసారు.

2014 నాటి రేట్లు కు 2020లో పనులు చేస్తారా ? ఇదేనా ధర్మం అని ప్రశ్నించారు. మోదీ చేసేది ప్రజల తో వాస్తవాలు చెప్పండి అని ఆయన డిమాండ్ చేసారు. పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్, పవర్ ప్రాజెక్టు ఉంటుందా ? నిజాలు చెప్పండి అన్నారు. నీతి ఆయోగ్ వాళ్ళు ప్రధానికి కి రాసిన లేఖ ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి అడిగే దమ్ము లేదు. ముఖ్యమంత్రి జగన్ అయినా  నీతి ఆయోగ్ లేఖ తీసుకురావాలి కదా ? అని ఆయన ప్రశ్నించారు. చట్టం అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు  పార్లమెంట్ లో అడగాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయం లో చంద్రబాబు హాయాంలో జరిగిన తప్పులు, మీరేమి చేస్తారో ప్రజలకు జగన్ చెప్పాలని ఆయన సూచించారు. మద్యం పాలసీ పై సమాచార హక్కు చట్టం చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు అన్నారు. సమాచారం ఇవ్వనప్పుడు పారదర్శక పాలన ఏలా అవుతుందని, కేంద్రం ఏపీ కు మోసం చేస్తుంటే అడగటానికి భయమెందుకు ? అని ఆయన రాష్నించారు. ప్రజలు అనుకున్నట్టు గా సీబీఐ కేసులు కు భయపడుతున్నారా ? అని ఆయన ప్రశ్నించారు. జగన్ అధికారం శాశ్వతం  కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: