వైసీపీ కి ఇప్పుడు ఏపీ లోఅంత శుభ శకునంగా సాగిపోతుంది.. కరోనా తగ్గిపోతూ ఉండడం, ప్రజలు సంతోషంగా జగన్ పాలన లో ఉండడం చూస్తుంటే జగన్ ముఖ్యమంత్రి గా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు కు సరైన బుద్ధి చెప్పి ప్రజలు జగన్ ఎన్నుకోవడం మంచిదే అయ్యింది.. ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.. దాని మీద ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో కూడా అందరికి తెలుసు.. అయితే ఈ ఎన్నికలముందు తిరుపతి ఉప ఎన్నిక జరగబోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇప్పటికే ఏపీలో తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించడానికి అన్ని సిద్ధం చేస్తుంది. ముహూర్తం పెట్టడమే ఉంది.. అయితే అప్పుడే ఎన్నికలు దగ్గరికొచ్చేసినట్లు ఇక్కడి ప్రతిపక్షాల ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. టీడీపీ అయితే ఎక్కడ తమ ఉనికి కోల్పోతుందో అని వైసీపీ ఓడించాడనికి బీజేపీ తో చేతులు కలపడానికి సైతం సిద్ధంగా ఉంది..  అయితే బీజేపీ మాత్రం టీడీపీ కన్నెత్తి కూడా చూడట్లేదు.. అయితే ఇంత జరుగుతున్న టీడీపీ అందరికంటే ముందు అభ్యర్థి ని ప్రకటించి షాక్ ఇచ్చింది.

తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ ఇటీవల కన్నుమూయడంతో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. కాబట్టి అక్కడ పోటీ చేసి విజయం సాధించి మెల్లగా రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుంటాం అన్నది చంద్రబాబు ఉద్దేశం. అయితే ఇలాంటి సమయంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అలకబూనడం పెద్ద సమస్య గామారింది.. దాంతో ఒక్కసారి గా టీడీపీ పార్టీ పరువుపోయినట్లు అయ్యింది.  మొదటినుంచి చంద్రబాబు పట్ల ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె చర్యల ద్వారా తెలిసింది..ఎన్నికల వ్యయం పార్టీ చూసుకుంటన్న చివరికి చేసుకోకపోవడంతో ఆమె అలకబూనారు.. మొన్నటి ఎలక్షన్స్ లో ఓడిపోయినా ఆమె ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పేరుతో ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేయడంతో చివరకు పార్టీ తరుపున మొత్తం వ్యయం భరించేందుకు అంగీకారం కుదిరినట్టు చెబుతున్నారు. ఇది వైసీపీ కి లభించే అవకాశం ఉంది. దీన్ని పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: