జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుందో లేదోప్రతిపక్షాలు దాన్ని ఓర్వలేకపోతున్నాయి.. జగన్ వచ్చిన దగ్గరినుంచి ఎప్పుడెప్పుడు జగన్ ను పీఠం మీదనుంచి దింపి తాము ఆ కుర్చీ ఎక్కుదామా అని ఎదురుచూస్తూ జగన్ పై లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల తరపున పోరాడే పుణ్యకాలాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులు.. అమరావతి విషయంలో తప్పా ప్రతిపక్ష నాయకులు ప్రజల తరపున పోరాడిన అంశం ఏమీ లేదు.. అది కూడా వారి సొంత ప్రయోజనాలకోసం చేశారు..

చంద్రబాబు అయితే ఇందులో జగన్ ఎంత బ్యాడ్ చేయాలనుకున్న చివరకికి తానే ప్రజలకు దూరమైపోయాడు..గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని విమర్శలను చంద్రబాబు చేస్తూ రాష్ట్రంలో గందరగోళం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈమధ్య కొత్తగా జమిలి ఎన్నికలు వస్తాయని గట్టి నమ్మకం తో చెప్తున్నాడు.. అయితే చంద్రబాబు పడే పడే ఇలా అనడం ఇప్పుడు కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది..  ఆయనకు తోడు ఇప్పుడు మోడీ కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని తాపత్రయ పడుతున్నట్లు కనిపి స్తుంది. గ‌తంలో 2015లో కూడా ఇలానే భారీ ఎత్తున జ‌మిలి ఎన్నిక‌ల‌పై ఊద‌ర‌గొట్టారు.

ఇంకేముంది.. జ‌మిలి వ‌స్తుంద‌ని.. దేశం అంత‌టా ఒకే సారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం.. ఒకేసారి రాష్ట్రాల్లోను, కేంద్రంలోనూ ప్ర‌భుత్వాలు ఏర్ప‌డ‌డం జ‌రుగుతుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీనికి సంబంధించిన లాభాలు, న‌ష్టాల పేరుతో మీడియా పెద్ద ఎత్తున క‌థ‌నాల‌ను కూడా ప్ర‌చురించ‌డం డిబేట్లు పెట్ట‌డం తెలిసిందే. దీని వెనుక‌.. న‌రేంద్ర మోడీ బీజేపీ వ్యూహం భారీ ఎత్తున ఉంద‌నే ప్రచారం ఉంది. అయితే.. ఏమైందో ఏమో.. ఆ ప్ర‌తిపాద‌న అప్ప‌ట్లోనే వీగిపోయింది. ఇక‌, మ‌ళ్లీ ఇప్పుడు తాజాగా అన్యాప‌దే శంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నోటి నుంచి మ‌రోసారి .. జ‌మిలి మాట వ‌చ్చింది. ఈసారి జమిలీ ఎన్నికలు ఏ ప్రాతిపదికన వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: