ఖట్మండు: చైనాకు నేపాల్ భారీ షాక్ ఇచ్చింది. ‘మా ఆంతరంగిక విషయాల్లో మీ
జోక్యం అవసరం లేద’ని కుండబద్దలు కొట్టింది. దీంతోడ్రాగన్‌కు దిమ్మతిరిగినంత పనైంది. భారత్‌పై ఎలాగైనా పైచేయి
సాధించాలనుకునే చైనా నేపాల్‌ను అడ్డుపెట్టుకుని కథ నడిపించేందుకు

ప్రయత్నించింది. పీఎం కుర్చీ కోసం నేపాల్ ప్రధాని ఓలీ శర్మ కూడా చైనాకు కట్టు బానిసలా మారిపోయారు.
 భారత్‌తో వైరానికి సైతంకాలు దువ్వారు. చైనా ఏం చెబితే దానిని శిరసావహిస్తూ.. భారత భూభాగాలనే ఆక్రమించుకునేందుకు పన్నాగాలూ పన్నారు.

 అయితేఅలాంటి చైనాకు నేపాల్ నేడు షాకిచ్చింది.ఇన్నాళ్లూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అయినప్పటికీ..
అధికారమంతా చైనా రాయబారి హౌయాంకీనే అంతా నడిపించారు. హౌ యాంకి కూర్చోమంటే ఓలీ శర్మ కూర్చున్నారు.. నిలబడమంటే నిలబడ్డారు. అంతలా సాగింది నేపాల్‌లో చైనా దాష్టీకం. అయితే ఇప్పుడు

ఉన్నట్లుండి ఓలీ శర్మ చైనాకు ఓ భారీ ఝలక్ ఇచ్చారు. తమ పార్టీలో లోపాలు
తామే సరిదిద్దుకుంటామని, వేరే దేశాల అవసరం లేదని

హౌయాంకీకి తెగేసి చెప్పారు. దీంతో అవాక్కవడం డ్రాగన్ కంట్రీ వంతైంది.
‘పార్టీలో తలెత్తిన ఇబ్బందులను నేనే పరిష్కరించుకోగలను. ఆ సత్తా నాకుంది.
ఇతర దేశాల జోక్యం అవసరం లేదు’ అంటూ ఓలీ శర్మ

నేరుగా చైనా రాయబారి హౌ యాంకీకే చెప్పడంతో ప్రస్తుతం ఒక్కసారిగా అక్కడి
వాతావరణం వేడెక్కింది. ఇన్నాళ్లుగా నేపాల్‌

భూభాగాలను చైనా ఆక్రమిస్తున్నా నిమ్మకు నీరెత్తనట్లు ఉన్న ఓలీ శర్మ,
నేపాల్ పాఠశాలల్లో చైనీస్ భాష నేర్పిస్తున్నా పట్టించుకోని ఓలీ శర్మ ఉన్నట్లుండి స్వరం మార్చడం ప్రస్తుతం అక్కడి రాజకీయాల్లో హాట్
టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే గత ఏప్రిల్‌లో నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో అంతర్గతంగా వివాదం రేగింది. ప్రధాని కేపీ శర్మ ఓలీకి, మాజీ ప్రధాని పుష్ప

కమల్ దహల్ ప్రచండతో విభేదాలు చెలరేగాయి. ఏకంగా ప్రధాని ఓలీ శర్మ రాజీనామా చేయాలని ప్రచండ డిమాండ్ చేసే వరకూ విభేదాలు వెళ్లాయి. అయితే ఈ వివాదాన్ని చల్లార్చడం కోసం చైనా రాయబారి హౌయాంకి మధ్యవర్తిత్వం వహించారు. పలువురు నేతలతో కూడా హౌయాంకి చర్చలు జరిపారు. దీనిపై ప్రత్యర్థులు విమర్శలు చేసినా నేపాల్
కమ్యూనిస్టు పార్టీ సమర్థించుకుంది. తమ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కోవడం చైనాకు ఇష్టం లేదని తెలిపింది. నేపాల్ నాయకులు
 తమ విభేదాలను పరిష్కరించుకొని ఐక్యంగా ఉండాలని

చైనా కోరుకుంటోందని చెప్పుకొచ్చారు. అంతలా కేపీ ఓలీ శర్మ చైనాతో
కలిసిపోయారు. చైనా రాయబారి హౌయాంకిని వెనకేసుకొచ్చారు.

అలాంటిది ఇప్పుడు ఉన్నట్లుండి ఓలీ శర్మలో వచ్చిన మార్పుకు కారణమేంటా అని సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి దీనిపై చైనా ఎలా 

మరింత సమాచారం తెలుసుకోండి: