న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ఓ తీపికబురందింది. అతి త్వరలో వారందరికీ కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్ వ్యాక్సిన్ ఏ స్థాయిలో అందుబాటులోకి వస్తుందో గుర్తించి, దానికి అనుగుణంగా 3, 4 వారాల్లోనే అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. దీనికోసం పాలీక్లీనిక్
సౌకర్యాలను వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల వ్యాక్సిన్
పంపిణీ సులభమవుతుందని చెప్పారు.

దేశవ్యాప్తంగా వాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్న సంస్థలతో ప్రధాని నరేంద్ర
మోదీ నేడు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్‌లో జరిగిన ఈ సమావేశంలో వ్యాక్సిన్ అభివృద్ధిపై చర్చించారు. వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను
ప్రశంసించారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకుని, భారత్ బయోటెక్
శాస్త్రవేత్తలతో స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని తెలుసుకున్నారు. ఆ వెంటనే పుణే బయలుదేరారు.
 పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌‌ను కూడా సందర్శించి, అక్కడి పురోగతిని సమీక్షించి తిరగి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: