ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు సగానికి పడిపోయాయి. నిన్న భారీగా నమోదైన కరోనా కేసులు నేటితో ఆ సంఖ్య మరింత తగ్గుముఖం పట్టింది.. కరోనా పరీక్షలు భారీగా చేసిన  కేసులు మాత్రం తక్కువకి  పడిపోయాయి . అలాగే కరోనా మరణాలు కూడా తక్కువ స్థాయికి పడిపోయాయి.. శనివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో గడచిన 24 గంటల్లో 49 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో కేవలం 625 మందికి కరోనా పాజిటివ్ వచ్చాయి.. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 67 వేలకి చేరుకుంది..

నిన్నటితో పోలిస్తే నేడు కరోనా మరణాలు సంఖ్య కూడా స్వల్పంగా ఉంది.. నేడు కరోనా బారినుండి కేవలం ఐదుగురు మరణించారు . దీంతో రాష్ట్ర వ్యాప్తంగా  కరోనా బారి నుండి  మరణించిన వారి సంఖ్య ఆరువేల వేలకు చేరింది..

కరోనా నుండి కోలుకున్న వారి గురించిి గమనిస్తే శనివారం ఒక్కరోజే వెయ్యి మందికి పైగా కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకొని బయటపడ్డారు.. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షల నలభై ఎనిమిది వేల మందికి పైగా కరోనా బారినుండి సురక్షితంగా బయట పడ్డారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వేలకు పైగా ఆక్టివ్ కేసులు ఉన్నాయి..

కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్నా తరుణంలో కేంద్ర హోంశాఖ డిసెంబర్ నెల కరోనా లాక్ డౌన్ నిబంధనలని ప్రకటించింది.. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు పలు ముఖ్య సూచనలను జారీ చేసింది.. ఈ కరోనా నిబంధనలు  డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోంశాఖ తెలిపింది..

ఏపీ రాష్ట్ర ప్రజలని ఒకపక్క కరోనా సెకండ్ వేవ్ మరోపక్క నివర్ తుఫాన్   ఈ రెండు భయపడుతున్నాయి. కాబట్టి తుఫాను పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కరోనా పట్ల అమలు పరిచే నిబంధనలని  పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి ..

మరింత సమాచారం తెలుసుకోండి: