ప్రస్తుతం భారత రక్షణ రంగం రోజురోజుకు ఎంతో పటిష్టంగా మారుతున్నది అన్న  విషయం తెలిసిందే. ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన యుద్ధ విమానాలను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడంతోపాటు.. యుద్ధ విమానాల తయారీ కూడా ఇప్పుడిప్పుడే మొదలుపెడుతుంది భారత్ . ఇప్పటికే అధునాతన టెక్నాలజీతో కూడిన రఫెల్ యుద్ధ విమానాలకు ఫ్రాన్స్  కి ఆర్డర్ ఇచ్చి రప్పిస్తుంది అనే విషయం తెలిసిందే. అంతే కాకుండా భారత రక్షణ పరిశోధన సంస్థ తయారు చేసిన శక్తివంతమైన మిస్సైల్స్  తో ప్రస్తుతం భారత్ ఎంతో పటిష్టంగా మారుతుంది అనే విషయం తెలిసిందే .



 ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత ఆర్మీ లో ఉన్న అతి తక్కువ శక్తివంతమైన యుద్ధ విమానం ఏది అంటే మిగ్  యుద్ధవిమానాలు అని చెప్పవచ్చు. సాంకేతికపరంగా కూడా మిగ్  యుద్ధవిమానాలు చాలా వీక్ అనే చెప్పాలి. ప్రస్తుత భారత ఆర్మీలో ఉన్న అత్యంత తక్కువ శక్తివంతమైన మిగ్  యుద్ధ విమానాలతో ప్రస్తుతం భారత ఆర్మీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే గతంలో రష్యా నుంచి యుద్ధ విమానాలను ఎన్నో లక్షల కోట్లు వెచ్చించి భారత్ కొనుగోలు చేసింది అనే విషయం తెలిసిందే.  కానీ ప్రస్తుతం భారత ఆర్మీ నీ మిగ్ యుద్ధ విమానాలు వణికిస్తున్నాయి.


మిగ్ యుద్ధ విమానాల ద్వారా వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉండటం ప్రస్తుతం భారత ఆర్మీ లో ఆందోళనకరంగా మారిపోయింది. ఇప్పటికే పలుమార్లు మిగ్  యుద్ధ విమానాల ద్వారా వెళ్ళిన ఎంతో మంది పైలెట్లకు ప్రమాదం జరిగింది అన్న విషయం తెలిసిందే. మరోసారి ఇలాంటి తరహా ప్రమాదం జరిగింది. నిన్న భారత నౌకాదళానికి చెందిన టువంటి మిగ్ 29 కుప్పకూలింది. శిక్షణలో భాగంగా అరేబియా సముద్రం పై ప్రయాణిస్తున్న సమయంలో కుప్పకూలిపోయింది మిగ్ యుద్ధ విమానం. ఇందులోని ఒక పైలెట్ ను  కాపాడగలిగినప్పటికీ   మరో పైలట్ మాత్రం గల్లంతయ్యాడు. ఇలా మిగ్  యుద్ధ విమానాలు భారత్ను వణికిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: