టిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా.... వైకుంఠ ద్వారాలను పదిరోజుల పాటు తెరిచి వుంచాలని నిర్ణయించాం అని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. కోర్టు ఆదేశాలు మేరకు కమిటిని నియమించాం అని ఆయన పేర్కొన్నారు. మఠాధిపతులు,పిఠాధిపతులు అంగీకారం మేరకు కమిటి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి వుంచాలని నివేదిక సమర్పించింది అన్నారు. టీటీడీ ఆస్థులు పై శ్వేతపత్రం  విడుదల చేసారు.

భక్తులకు స్వామివారికి సమర్పించిన ఆస్థులు పై శ్వేతపత్రం విడుదల చేసారు. దేశవ్యాప్తంగా 1128 ఆస్థులు వున్నాయి.... 8088 ఎకరాల విస్థిర్ణంలో ఆస్థులు వున్నాయి అని తెలిపారు. దేశవ్యాప్తంగా వున్న ఆస్థులును  ఏ విధంగా వినియోగంలోకి తీసుకురావాలన్న అంశంపై పరిశీలన కోసం కమిటిని నియమించాం అన్నారు. శ్రీవారి ఆలయంలో  మహాద్వారం బంగారు తలుపులు,ధ్వజస్తంభం పీఠంకు బంగారు తాపడం చేయిస్తామని అన్నారు. టీటీడీ ఉద్యోగులకు అవగాహన కల్పించి ఈ హెచ్ ఎస్ స్కీంను అమలు చేస్తాం అన్నారు.

ఇక .నడకమార్గంలో వున్న గోపురాలకు మరమత్తులు చేస్తున్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం డిజిల్ బస్సులు స్థానంలో 100 నుంచి 150 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతాం అని ఆయన చెప్పారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీ పవర్ వినియోగంలోకి తీసుకువస్తాం అని తెలిపారు. పద్మావతి అమ్మవారి ఆలయానికి 11 కేజిల బంగారంతో సూర్యప్రభ వాహనం చేస్తామన్నారు. 29 కోట్ల రూపాయల వ్యయంతో తిరుమలలో కాటేజిల ఆధునికరణ చేపడతామని వెల్లడించారు. తెలుగు రాష్ర్టాలలో ప్రచార రథాలు ద్వారా విస్తృతంగా హిందు ధర్మ ప్రచారం చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లా కేంద్రాలలో కళ్యాణమస్తూ కార్యక్రమాని పునః ప్రారంభిస్తాం అని ఆయన వెల్లడించారు. తిరుపతిలోని బాలమందిరంలో  10 కోట్ల రూపాయల వ్యయంతో అదనపు హస్టల్ భవన్ నిర్మాణం చేపడతామని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: