గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల సంఘం చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓటు వేసే వారికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతుంది.  చాలా వరకు కూడా ఇప్పుడు చర్యలు చేపడుతుంది ఎన్నికల సంఘం. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని సూచిస్తుంది. ఓట‌రు గుర్తింపు కార్డుకు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో 18 గుర్తింపు కార్డులు వాడుకోవచ్చు అని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌ కు ఓట‌రు  గుర్తింపు కార్డు లేకున్నా ఈ క్రింది గుర్తింపు డాక్యుమెంట్ల‌ను చూపించి ఓటు వేసే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు జిల్లా ఎన్నిక‌ల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ మీడియాలో వెల్లడించారు.

ఓటు వేయ‌డానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్థార‌ణ‌కు , ఓట‌రు గుర్తింపు కార్డుల‌యినా చూపాలి లేదా అవి లేనివారు వారి గుర్తింపు నిర్థార‌ణ‌కు కింద తెలిపిన ప్ర‌త్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల‌లో ఏద‌యినా ఒక‌దానిని చూపాలని జిల్లా ఎన్నిక‌ల అధికారి ఓటర్లకు స్పష్టత ఇచ్చారు. ఏంటీ అనేది ఒకసారి చూస్తే... 1. ఆధార్ కార్డు, 2.  పాస్‌పోర్ట్‌, 3.  డ్రైవింగ్ లైసెన్స్‌, 4. ఫోటోతో కూడిన‌ స‌ర్వీస్ ఐడెంటిఫై కార్డ్‌, 5. ఫోటోతో కూడిన‌ బ్యాంకు పాస్‌ బుక్‌, 6. పాన్ కార్డు, 7.  ఆర్‌.జి.ఐ, ఎన్‌.పి.ఆర్ స్మార్ట్ కార్డు,

8. జాబ్ కార్డు, 9. హెల్త్ కార్డు, 10. ఫోటోతో కూడిన పింఛ‌న్‌ డాక్యుమెంట్, 11.  ఎం.ఎల్‌.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీల‌కు జారీ చేసిన అధికార గుర్తింపు ప‌త్రం, 12. రేషన్ కార్డు, 13. కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం, 14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు, 15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు, 16. అంగవైకల్యం సర్టిఫికేట్, 17. లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు, 18. పట్టదారు పాస్ బుక్ కావాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: