ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి అని తెలంగాణా సిఎం కేసీఆర్ అన్నారు. హైద్రాబాద్ చైతన్యవంతమైన నగరం అని ఆయన నేడు ఎల్బీ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. విద్యుత్ సమస్యను అధిగమించాం అని సిఎం అన్నారు. 24గంటలు విద్యుత్ ఇస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ట్యాంకర్ల దగ్గర వీధి పోరాటాలు లేవు అని సిఎం అన్నారు. నీటి సమస్యను తీర్చాము అని ఆయన చెప్పుకొచ్చారు. 24గంటలు మంచినీరు ఇవ్వాలనేది నా కల అని ఆయన  వ్యాఖ్యానించారు. నీళ్ల బిల్లులు లేకుండా ఉచితంగా 20వేల లీటర్ల నీరు అందిస్తాం అన్నారు.

అపార్ట్మెంట్ లలో ఉండే వారికి కూడా 20వేల లీటర్ల ఉచిత నీరు సరఫరా చేస్తాం అని స్పష్టం చేసారు. కులానికి మతానికి సంబంధం లేకుండా కేసీఆర్ కిట్ ఇస్తున్నాం అని ఆయన  పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతీ రైతుకు రైతు బంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన వెల్లడించారు. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాము అని పేర్కొన్నారు. కుల వృత్తులను ఆదుకున్నాం అన్నారు. దోబీ ఘాట్ లకు, లాండ్రీ లకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.

నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ అన్నారు. పేదల పిల్లల కోసం వెయ్యి గురుకులాలు ప్రారంభించాం అని, సంక్షేమంలో తిరుగులేదు అని ఆయన స్పష్టం చేసారు. వ్యవసాయంలో దేశంలో నంబర్ వన్ కు వెళుతున్నాం అని ఆయన వెల్లడించారు. అన్ని ఆలోచించి ఓటు వేయాలి అని ఆయన  కోరారు. గాలి వటంగా వేయొద్దు అని అన్నారు. నగరం ఆశాస్త్రీయంగా పెరిగింది అని, అందుకు మా ముందు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. హైద్రాబాద్ అభివృద్ధి కోసం సహాయం అడిగితే కేంద్రం పట్టించుకోలేదు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: