హైదరాబాద్: దేశాన్ని పాలించడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని, అందుకే దేశం దిశదశ మార్చాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నాననే ఇన్ని రాష్ట్రాల నుంచి నేతల వచ్చి పిచ్చి ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ పార్టీని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓడించేందుకు బీజేపీ నాయకులు దేశం నలుమూలల నుంచి వచ్చి లేనిపోని మాటలు, అబద్దపు మాటలు చెబుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఎల్.బి.స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ప్రశాంతత కావాలో, కర్ఫ్యూ కావాలో మీరే నిర్ణయించుకోవాలని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. బిపాస్ కావాలో… కర్ఫ్యూ పాస్ కావాలో… బిల్డర్లు నిర్ణయించుకోవాలని కేసీఆర్ కోరారు. చల్లని హైదరాబాద్ చక్కటి హైదరాబాద్ నా లక్ష్యమని, ప్రతి ఏడాది రూ.10వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తామన్నారు.


హైదరాబాద్ కు వరదలు వస్తే రూ.1350 కోట్లు మంజూరు చేయాలని కోరగా, 13 పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి రూ.10వేల చొప్పున సాయం చేస్తుంటే అది కూడా అందకుండా బీజేపీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. డిసెంబర్ 7 తరువాత నష్టపోయిన వారందరికీ డబ్బులు పంపిణీ చేస్తామన్నారు. వరద సాయం కావాలంటే ఒక్క పైస ఇవ్వలేదు కాని వరదలా బీజేపీ నేతలు వస్తున్నారు. ఇవి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలా ? నేషనల్ ఎన్నికలా ? అర్థం కావడం లేదని కేసీఆర్ విస్మయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: