హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో నేతలు,కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.. బీజేపి వర్సెస్ టీఆరెఎస్ పార్టీలు నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు..వారి జోరు పెంచుతున్నారు..టీఆరెఎస్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నియోజక వర్గాల్లోని నేతలకు ఎన్నికల పై దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు..తాజాగా తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ఎల్బి స్టేడియంలో భారీ సభను నిర్వహించారు.. 



ఈ సందర్బంగా రాష్ట్రంలోని నేతలు , కార్యకర్తలు హాజరయ్యారు. హైదరాబాద్ నగరం ఎంతో విశేషమైన చైతన్యవంతమైన నగరం. గతంలో మనం ఎన్నో మాటలు పడ్డాం. 2001లో నేను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేపట్టినప్పుడు ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు. ఎన్నో అపోహల మధ్య తెలంగాణ వచ్చింది. ఎంతో మంది నమ్మకంతో ప్రజలు తొలి నుంచి టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు.. ఇప్పటికీ కూడా అదే పార్టీ అధికారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తెరాస సర్కార్ పై ప్రజలకున్న నమ్మకమే కారణమని తెలుస్తోంది. 



ఇది ఇలా ఉండగా..ఈ సభకు ముగ్గురు పెద్ద నాయకులు మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం.. వాళ్ళు ఎవరో కాదు.. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి- జగదీష్ రెడ్డి కేసీఆర్ సభలో 130వ డివిజన్ టిఆర్ఎస్ నేతల నిరసన సభలో ఎక్కడా కనిపించలేదు..అందుకు కారణాలు ఎంటో ఎవరికీ అర్థం కాలేదు.. ఇకపోతే ఈ సభలో సీఎం కేసీఆర్ కు చుక్కెదరైంది.. కేసీఆర్ మాట్లాడుతుండగా జనాలు వెనుతిరిగారు.. దాదాపు సభ మొత్తం ఖాళీ అయ్యింది.. ఇకపోతే కొందరు తెరాస నేతలు మాత్రం బీజేపి ని తిట్టినప్పుడు మాత్రమే చప్పట్లు కొడుతూ , ఈలలు వేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సభ వల్ల కేసీఆర్ కు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.. మొత్తానికి అలా జరిగిపోయింది. రేపు సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవాలని ఎన్నికల కమీషన్ హెచ్చరించింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: