హైదరాబాద్‌ను మునుపెన్నడూ లేని విధంగా భారీ  వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. ఎంతో మంది ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. భారీ స్థాయిలో నష్టం జరిగింది. అయితే, వరద బాధితులను ఆసరాగా ప్రభుత్వం.. కొంతమేర  వరదసాయాన్ని అందించింది. ఇదే సమయంలో.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. వరదసాయం పంపిణీ అర్దంతరంగా నిలిచిపోయింది.  అయితే, వరద బాధితులకు శుభవార్త వినిపించారు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు..

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ హైదరబాద్ లో వరదలు చూసి చేలించిపోయాను అన్నారు.ప్రజలు పడుతున్న బాధలు చూడలేకపోయానన్నారు అందుకే వెంటనే వరద సాయాన్ని ప్రకటించానని తెలిపారు.అయితే ఈ లోపల ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆగిపోవడం జరిగిందని ఎన్నికలు పూర్తయిన తరువాత డిసెంబర్‌ 7 నుంచే మళ్లీ  వరదసాయం అందిస్తామని చెప్పారు.

 లక్షల మంది పేదల బతుకులు ఆగమవడం చూసి చాలా బాధపడ్డానని కే‌సి‌ఆర్ అన్నారు.కేంద్రం నుండి ఎలాంటి సాయం అందకున్న కానీ, దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు సాయం అందజేశామని కే‌సి‌ఆర్ స్పస్టం చేశారు.. గ్రేటర్ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్‌ పోతుంది.. ఆ తర్వాత డిసెంబర్‌ 7వ తేదీ తర్వాత వరద సాయం అందని వారికి అందిస్తాం అని కే‌సి‌ఆర్ గారు ఎన్నికల ప్రచార బహిరంగ సభలో స్పస్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: