గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ముందుగా ఆ పార్టీ అధినేత పవన్ ప్రకటించిన తరువాత బీజేపీ నేతల ఒత్తిడితో దానిని  విరమించుకుని, బీజేపీకి పవన్ మద్దతు ప్రకటించారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా పవన్ బిజెపి తరఫున ఎన్నికల ప్రచారానికి దిగుతారని మొదటి నుంచి జనసేన పార్టీ నాయకులు,  బిజెపి నాయకులు అంచనా వేశారు. ఈనెల 28, 29 తేదీలలో పవన్ రోడ్ షో ఉంటుందని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే అంతకు ముందు నుంచి ఊహించినట్లుగానే , గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి పవన్ దూరంగా ఉన్నారు. ఒకవైపు గ్రేటర్ లో కేంద్ర బీజేపీ పెద్దలు, మంత్రులు ,జాతీయ స్థాయి నాయకులు, ఇలా ఎంతోమంది హైదరాబాద్ లో అడుగు పెట్టినా, పవన్ మాత్రం ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు ఆసక్తి చూపించకపోవడం, ఇంటికే పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది.



 ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చి అనేక అంశాలపై క్లారిటీ తెచ్చుకున్న పవన్ ఇక బిజెపితో కలిసి రాజకీయాల్లో మరింత యాక్తివ్ అవ్వాలని చూశారు. దీంతో గ్రేటర్ లో పవన్ రోడ్ షో నిర్వహిస్తారు అని అంత అంచనా వేయగా,  పవన్ మాత్రం ఆ సాహసం చేయకపోవడం ఇప్పుడు బీజేపీ నేతల్లో సైతం చర్చనీయాంశంగా మారింది.కెసిఆర్ పై అనవసర విమర్శలు చేయడం ద్వారా,  రానున్న రోజుల్లో ఎన్నో తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే గ్రేటర్ ఫలితాలలో తేడా వస్తే తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మరోవైపు సినిమాలలో యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో అనవసర తలనొప్పులు కంటే మౌనంగా ఉండడమే బెటర్ అన్న అభిప్రాయంతో పవన్ సైలెంట్ అయిపోయినట్టుగా సమాచారం. పవన్ వస్తారని దుబ్బాక ఎన్నికల సమయం లో ఆశలు పెట్టుకున్నా, ఆయన రాలేదు. 



ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల లోను పవన్ హ్యాండ్ ఇస్తుండడం తో కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ జనసేన పార్టీ పై సంచలన విమర్శలు చేశారు. దీనిపై జనసేన ఘాటుగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ఇప్పటికే లేఖ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: