ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొనేవారు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యారు.. ప్రేమ కులం , గోత్రం అడ్డురాదు అని ఒకప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు మాత్రం కులం , మతం మార్చుకుంటే పెళ్లి అంటున్నారు. ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియా లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అక్కడ మతం మారక పోతే పెళ్లి, గిల్లి ఏముండదు. అలాంటి వాటి పై కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు చర్చలు జరిపి కీలక నిర్ణయాన్ని తీసుకుంది.. 



వివరాల్లోకి వెళితే.. అలా మతం మార్చుకోవడం చట్ట ప్రకారం నేరం..లవ్ జిహాద్ గా ప్రకటించారు.మత మార్పిడులకు పాల్పడే వారిపై కొరడా ఝళిపిస్తూ యూపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘మత మార్పిడుల వ్యతిరేక బిల్లు 2020’పేరుతో యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆమోదం తెలిపారు. ఈరోజు అన్నీ పరిశీలించిన గవర్నర్ సంతకం చేశారు. దీంతో ఈరోజు నుంచే ఇది అమలులోకి వస్తుంది. బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించనున్నారు.



అలా కాదని చట్టానికి వ్యతిరేకంగా మతం మార్చి పెళ్లి చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.. 1 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ.15 వేల జరిమానా విధిస్తారు. ఒకవేళ మైనర్లు, దళిత, గిరిజన యువతులను, మహిళలను బలవంతంగా మతమార్పిడికి గురిచేస్తే 3 నుంచి పదేళ్ల జైలు శిక్ష తో పాటు, రూ.50 వేల జరిమానా విధిస్తారు.మధ్య ప్రదేశ్, అసోం లాంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా లవ్‌ జిహాద్‌, మతమార్పిడిలకు వ్యతిరేకంగా చట్టం రూపొందించే యోచనలో ఉన్నాయి. హర్యానా కూడా ఇలాంటి  ఆలోచనలు చేస్తుందని తెలుస్తుంది.. మొత్తానికి ఇలా చేయడం. ఒకందుకు మంచిదే.. ఇలా చేయడం వల్ల ఎటువంటి నష్టాలు జరగవు అని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: