ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో  జగన్ ప్రభుత్వం  సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఇకపై ప్రకటన  విడుదలైన రోజు నుంచి 14 రోజుల్లోనే పూర్తి చేయనున్నారట. ఈ సందర్బంగా  పంచాయతీరాజ్‌ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశారు.దీనికి సంబంధించిన  బిల్లును ఈనెల 30 నుంచి నిర్వహించనున్న శాసనసభ సమావేశాల్లో మొదలపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది.ఇక ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు  2013వ సంవత్సరంలో  పంచాయతీ ఎన్నికలను ఇరవై ఒక్క  రోజుల పాటు నిర్వహించటం జరిగింది.

 ఇప్పుడు ఈ పరిమితిని  14 రోజులకు కుదిస్తూ 1994 పంచాయతీరాజ్‌ చట్టంలో చేసిన సవరణలపై ఆగస్టులో గవర్నర్‌ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. గడువులోగా అసెంబ్లీలో బిల్లు పెట్టకపోవడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇకపై పంచాయతీ ఎన్నికల నిర్వహణ కూడా ఇలానే  ఉంటుందని స్పష్టమైంది .. మొదటి రోజు ఎన్నికల ప్రకటన మూడవ రోజు నామినేషన్ల స్వీకరణ.. ఐదవ రోజు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఉంటుంది.


ఆరో రోజు నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఏడవ రోజునామినేషన్ల తిరస్కరణ, అదేరోజు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఎనిమిదో రోజు అభ్యంతరాల పరిష్కారం ఉంటుంది.. తొమ్మిదో రోజు నామినేషన్ల ఉపసంహరణ.. పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ చేస్తారు. 14వ రోజు ఎన్నికల నిర్వహణ, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.ఇలాంటి మరెన్నో పొలిటికల్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి...



మరింత సమాచారం తెలుసుకోండి: