విజయశాంతి బీజేపీలో చేరడం దాదాపుగా ఖరారైంది.. రేపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో  విజయశాంతి బీజేపీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది.. ఆమెతో పాటు కొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం..విజయశాంతి ఇటీవలే ఢిల్లీకి వెళ్లి జాతీయ అధ్యక్షుడుని  కలిసినట్టు ప్రచారం సాగుతోంది..

ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం బీజేపీలో లో చేరితున్నట్టు విజయశాంతి ప్రకటించింది.. ఈ మేరకు రేపే విజయశాంతి కాషాయ కండువా  కప్పుకోనుంది ..
కొంతకాలంగా  విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి తో ఒకసారి  అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో విజయశాంతి పలుమార్లు భేటీ కావడం విశేషం ..  ఈ భేటీ ఫలితంగానే ఆమెని బీజేపీలోకి చేర్చేలా నేతలు ఒప్పించినట్లు తెలుస్తుంది ..

బిజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అయ్యాక  ఆయన వ్యవహార శైలి బాగా నచ్చిందని  కేసీఆర్ ప్రభుత్వానికి  బండి సంజయ్ వ్యవహరించే తీరు ఆనందంగా ఉందని ఈ పరిణామాల వల్లనే  తను కూడా బిజెపి పార్టీలో ఉండాలని విజయశాంతి నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తుంది .. గత  దుబ్బాక ఎన్నికల్లో  బీజేపీ విజయం సాధించడం పట్ల బిజెపి పార్టీ పై తనకు ఉన్న  అభిప్రాయం మారిందని ఆ  అభిప్రాయం ఆమెని బిజెపి పార్టీలో చేరేలా   ప్రోత్సహించిందని విజయశాంతి అంటున్నారు ..

విజయశాంతి బిజెపి పార్టీలో చేరడం పట్ల కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నా ఫైనల్ గా  విజయ శాంతి బిజెపి గూటికి చేరడం ఖాయం అయిపోయింది..  చాలా రోజులుగా విజయశాంతి బీజేపీ పార్టీ లో చేరిక పై వస్తున్న వార్తలకి  విజయశాంతి రేపటితో ముగింపు పలకనున్నారు..   కేంద్ర హోం శాఖ మంత్రి గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం రేపు హైదరాబాద్ వస్తుండగా అమిత్ షా సమక్షంలో విజయశాంతి బిజెపి కార్యాలయంలో లో ఆడంబరంగా  బీజేపీ  పార్టీలో చేయనున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: