దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో సత్తా చాటాలని పోరాడుతోంది. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ నేతలు కూడా పార్టీ తరపున నగరంలో ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ దాస్‌ హైదరాబాద్‌ లో నిన్నా మొన్నా రోడ్‌ షో నిర్వహించారు. ప్రచారం నేటితో ముగియనుండడంతో ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. 


ఉదయం పదిన్నరకు ఆయన నగరానికి వస్తారు. మరి కాసేపట్లో హైదరాబాద్ బేగం ఎయిర్పోర్ట్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొననున్నారు. ఎయిర్ పోర్ట్ లో కార్యకర్తలకు గ్రీట్ చేయనున్న షా ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా చార్మినార్ వెళ్లి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు అమిత్ షా. అమిత్‌షా భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తూ ఉండటంతో.. పాతబస్తీలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తోంది  పోలీస్ విభాగం. 


భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తర్వాత సనత్‌ నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. అయితే గెలిచే అవకాశాలు లేని చోట్ల ఆయన రోడ్ షో సాగుతోందాని అంటున్నారు. అంటే ఆయన జూబ్లీహిల్స్ ఎన్నుకోవడం వెనుక కూడా అదే కారణం అని అంటున్నారు.  రెండు గంటలకు బీజేపీ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు.  తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడి ప్రచారం, పోలింగ్ రోజున కార్యాచరణపై సమీక్షిస్తారు. ఏడు గంటలకు విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళతారు. అమిత్‌షా రోడ్‌షో సందర్బంగా... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. రోడ్ షో తర్వాత పార్టీ కార్యాలయానికి వెల్లనున్న అమిత్ షా అక్కడ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ లో చేరబోయే నేతలు అమిత్ షా తో కలిసే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: