గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక అని తేలిగ్గా ఎవరూ తీసేయడం లేదు. దీన్ని కూడా సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే గ్రాండ్ లెవెల్లోనే చూశారు. అలాగే ప్రచారాలూ చేశారు. టీయారెస్ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. కానీ గ్రేటర్ ఎన్నికల వేళ మాత్రం అమాంతంగా బీజేపీ రేసులోకి దూసుకొచ్చింది. కాంగ్రెస్ ని నెట్టుకుంటూ ముందుకు సాగుతోంది.

గ్రేటర్ లో ఈసారి కాషాయ జెండా ఎగరేయాలన్న గట్టి పట్టుదలతో బీజేపీ ఉంది.అందుకే అధికార పర్యటన పేరిట ప్రధాని మోడీ కూడా ఒకసారి అలా వచ్చి వెళ్ళిపోయారు. అమిత్ షా సహా ఉద్దండులు అందరూ దిగిపోయారు. ఎలాగైనా గ్రేటర్ పీఠం పట్టేయాలన్నదే వారి కోరిక.

సరే జనాల్లో మార్పు కొంత వచ్చిందా, పూర్తిగా వచ్చిందా అన్నది కూడా ఇక్కడ చర్చగా ఉంది. టీయారెస్ మీద యాంటీ ఉంటే అది ఏ రేంజిలో ఉంది అన్నది కూడా మరో చర్చ. ఇక టీయారెస్ తనకున్న అధికార శక్తియుక్తులతో ముందస్తు ఎన్నికలతో ఏ మేరకు వాటిని కవర్ చేసుకుంది అన్నది కూడా చర్చగా ఉంది.

అయితే టీయారెస్ ఎప్పటికపుడు గ్రేటర్ ఎన్నికల మీద సర్వే నివేదికలు తెప్పించుకుంటోందని కూడా ప్రచారంలో ఉంది. దాని ప్రకారం చూసుకుంటే గ్రేటర్ ఎన్నికల్లో టీయారెస్ కి ఈసారి కొన్ని సెగ్మెంట్స్ లో ప్రతికూల పరిస్థితులు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా గతంలో 99 సీట్లు గెలుచుకున్న టీయారెస్ ఈసారి అందులో తక్కువలో తక్కువ 30 దాకా కోల్పోతుంది అని అంటున్నారు.

అంటే అరవై నుంచి డెబ్బై దాకా టీయారెస్ కి ఈసారి గ్రేటర్ లో దక్కుతాయని అంచనాలు ఉన్నాయట. మరి ముప్పయి డివిజన్లు కోల్పోవడం అంటే పెద్ద విషయంగానే చూడాలి. అదే సమయంలో ఆ పోయిన సీట్లు ఎవరికి దక్కుతాయి అని కూడా చర్చ ఉంది. బీజేపీకి గతంలో మూడు సీట్లు వస్తే ఈసారికి అవి 30 దాకా సీట్లు పెరుగుతాయని అంటున్నారు. అలా కనుక గ్రేటర్ ఎన్నికల ముఖ చిత్రం ఉంటే కనుక టీయారెస్ కి మేయర్ పీఠం దక్కినా కూడా సుఖం ఉండదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: