ఎన్నికల కారణంగా హైదరాబాద్ లో వాడి వేడి వాతావరణం కొనసాగుతుంది.. ఈరోజు ఒక్కరోజే ప్రచారానికి సమయం ఉండటంతో నేతలు కార్యకర్తలు హడావిడి చేస్తున్నారు. రంగు రంగుల జెండాలతో హోరెత్తిస్తున్నారు. మా పార్టీ గొప్ప అంటూ సంకలు గుద్దుకుంటున్నారు. అందరికన్నా బీజేపి, తెరాస పార్టీలు మాత్రం ప్రజలను ఆలోచనలో పడేలా చేస్తున్నాయి. గత ఎన్నికల్లో భారీ ఓటమిని చూసిన టీఆరెఎస్ పార్టీ నేతలు ఈ ఎన్నికలను ఇజ్జత్ గా తీసుకున్నారు. కేసీఆర్,కేటీఆర్, హరీష్ రావు, కవిత వీరందరూ నిమిషం కూడా ఖాళీ లేకుండా ప్రచారం చేస్తున్నారు.


తాజాగా, మంత్రి హరీష్ రావు నగరంలోని రామ చంద్రాపురం డివిజన్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రామచంద్రాపురం డివిజన్‌ అభ్యర్థి పుష్పానగేశ్‌తో కలిసి అశోక్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం మైనార్టీ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఒకరేమో దారుస్సాలాం కూలుస్తానంటాడు.. మరొకరు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌ సమాధులను కూలుస్తామని చెప్తున్నాడు.. కానీ, ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదు అంటూ దుయ్యబట్టారు.



వరదలు వస్తే నష్టపోయిన బాధితులకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేశామని, ఎన్నికల కౌంటింగ్‌ పూర్తవ్వగానే 5వ తేదీ నుంచి వరద సాయం అందజేస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మొత్తం 6,60లక్షల మందికి వరద సహాయం చేశామన్నారు. రూ.15వేల లోపు ఉన్న ఇంటి పన్నులను 50 శాతం మాఫీ చేసినట్లు తెలిపారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చెప్పినట్లు ఇంటింటికి నల్లా నీటిని ఇవ్వడమే కాకుండా.. ఇప్పుడు నల్లా బిల్లులనే మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.. ప్రజలకు అన్నీ సదుపాయాలను అందించారు. బీజేపి , మజ్లిస్ పార్టీ లు ప్రజలను రెచ్చగొట్టి, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్‌లో హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను సృష్టస్తున్నారు ప్రజలు అది గమనించాలి అంటూ ఆయన అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: