ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఏది కావాలన్నా కూడా క్షణాల్లో అరచేతిలో వాలిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఏ  విషయం తెలుసుకోవాలన్నా కూడా ప్రస్తుతం యూట్యూబ్ అందరికీ వేదికగా మారిపోయింది. ఎంతో మంది తమకు కావాల్సిన ప్రతి సమాచారాన్ని కూడా యూట్యూబ్ వేదికగా చూస్తూ సరికొత్త విషయాలు నేర్చుకుంటున్నారు అనే విషయం తెలిసిందే.  ఇలా సోషల్ మీడియా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అయితే సోషల్ మీడియా మంచి కోసం ఉపయోగపడటమే కాదు...  ఎంతో మందిని నేరస్తులుగా కూడా మారుస్తున్న విషయం తెల్సిందే. యూట్యూబ్ లో దొంగతనం చేసి అదే రీతిలో దొంగతనాలకు పాల్పడ్డ చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలైనా  వారిని ఎంతో మందిని చూశాం.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి ఎస్బిఐ బ్రాంచ్  చోరీ కేసులో ప్రస్తుతం నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల విచారణ లో బయటపడిన నిజాలు తెలిసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడా గాంధీనగర్కు చెందిన కేదారి ప్రసాద్,  వినయ్ స్నేహితులు ఆర్థిక సమస్యలు అప్పులు  ఉండడంతో... ఒకేసారి పెద్ద దొంగతనం చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని అనుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాని ఆశ్రయించి దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడకుండా ఉండడం ఎలా అనే దానిపై పథకం వేశారు.



 ఈ క్రమంలోనే ఓరోజు ఇద్దరు కలిసి బ్యాంకు వద్ద రెక్కీ నిర్వహించి.. ఈనెల 21వ తేదీన బ్యాంకులోని 77 లక్షలను చోరీ చేశారు. అంతేకాదు ఏకంగా సినిమా రేంజ్ లో గ్యాస్ కట్టర్ ఉపయోగించి సీసీ కెమెరాలు తొలగించి.. పోలీసు జాగిలాలు వాసన పట్టకుండా కారంపొడి చల్లడం జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం ఎంతో చాకచక్యంగా పోలీసులు దర్యాప్తు చేయగా దొంగతనానికి పాల్పడిన నేరస్తులను 72 గంటల్లో పట్టుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: