గ్రేటర్ ఎన్నికల్ ప్రచారం  ఈసారి చాలా హాట్ హాట్ గా సాగింది. ఒకటి అని పది మాటలను రివర్స్ లో అందుకున్నారు నేతాశ్రీలు. ఎక్కడ నుంచో వచ్చిన బీజేపీ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా కేసీయార్ ని టార్గెట్ చేశారు. డెబ్బై ఏళ్ళ క్రితం నాటి నిజాం ని కూడా సీన్ లోకి తెచ్చారు. హైదరాబాద్ ఈ రోజు ఇండియాలో ఉంది అంటే దానికి కారణం సర్ధార్ వల్లభాయి పటేల్ అని కూడా చరిత్ర తిరగేసి మరీ చెబుతున్నారు.

ఇలా చరిత్రను తవ్వి మరీ ఫ్లాష్ బ్యాక్ లు చెప్పడం వెనక ఓట్ల రాజకీయమే ఉందని కచ్చితంగా చెప్పాల్సిందే. ఇక గ్రేటర్ ఎన్నికల్లో హిందూత్వ శక్తులకు మద్దతు ఇవ్వాలని డైరెక్ట్ గానే బీజేపీ నేతలు కోరుతున్నారు. హైదరాబాద్ పేరు మీద కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చక్కగా భాగ్యనగరం అని పేరుంటే దాన్ని హైదరాబాద్ అని మార్చారని, ఇపుడు తాము కచ్చితంగా మళ్ళీ భాగ్యనగరంగానే మారుస్తామని యూపీ సీఎం యోగీ పక్కా క్లారిటీగా  చెప్పేశారు.

ఫైజాబాద్ ని అయోధ్యగా మార్చిన తమకు ఇది చాలా సులువు అని కూడా అంటున్నారు. ఒక కుటుంబం అంటూ కేసీయార్ ని టార్గెట్ చేసిన బీజేపీ నేతలు, మజ్లీస్ ని కూడా వదిలిపెట్టలేదు. బీహార్ అసెంబ్లీలో ప్రమాణం చేసిన మజ్లీస్ ఎమ్మెల్యే హిందూస్థాన్ అని పలకడాన్ని నిరాకరించిన విషయాన్ని కూడా యోగీ  గుర్తు చేశారు. ఇలాంటి వారి వల్లనే అసలైన ముప్పు అంటూ యోగీ నిప్పులు చెరిగారు.

కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ మీద కూడా కామెంట్స్ చేస్తూ ఫ్రంట్ టెంటూ అంటున్నాడని యోగీ చేసిన విమర్శలు కేసీయార్ కి బాగానే తగిలాయనుకోవాలి. అందుకే ఆయన తన మీటింగులో ఫ్రంట్ పెడతాను అను నేను చెప్పానా అని జనాన్నే ప్రశ్నించారు. మేము జాతీయ రాజకీయాల్లో ఎలా రావాలో అలాగే వస్తామంటూ కేసీయార్ మరో ట్విస్ట్ ఇచ్చారు. అంటే తానే బీజేపీ నేతలకు కొత్త సినిమా చూపిస్తానని కేసీయార్ అంటున్నారు అన్న మాట. మరి బీజేపీ నేతలు సినిమా చూస్తారా చూపిస్తారా. వెయిట్ అండ్ సీ.




మరింత సమాచారం తెలుసుకోండి: