పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమాలపై దృష్టి పెట్టారు.. దాదాపు ఐదు సినిమాలు అయన సెట్స్ మీద ఉంచారు.. ఒకదానికొకటి విభిన్నమైన సినిమాలు కావడంతో ఈ సినిమా లపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు న్నాయి.. ఇక పవన్ సినిమాలకు వెళ్లడం రాజకీయ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.. అసలే పార్టీ ఒక్కటే సీటు వచ్చిన నేపథ్యంలో ప్రజల్లో ఉండాల్సింది పోయి పవన్ ఇలా సినిమాలు చేసుకోవడం వారికి అసలే నచ్చడం లేదు.. ఒకవైపు ఇతర పార్టీ లు వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తెగ కసరత్తులు చేస్తున్నారు. కానీ బీజేపీ తో పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా మొత్తం బీజేపీ కి వదిలేయడం వారికి ఏ మాత్రము నచ్చడం లేదట..

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నా కూడా రాజకీయాలపై అసలు దృష్టి పెట్టలేదు అనుకోవడానికి లేదు అయన తన ఒక కన్ను ను రాజకీయాల్లో ఉంచి అంత గమనిస్తున్నారని అంటున్నారు.. అంతేకాదు పార్టీ ఎక్కడ వీక్ గా ఉందొ కూడా గుర్తించే పనిని మొదలుపెట్టారట.. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో బలమైన నియోజకవర్గాలను గుర్తించి అక్కడ సమర్ధులైన వారిని ఇంచార్జిలుగా నియమించాలని పవన్ కల్యాణ‌్ డిసైడ్ అవడం శుభ పరిణామమే. అలాగే వారి ద్వారా ఇకపైన పార్టీ కార్యక్రమాలు పరుగులెత్తించాలని కూడా పవన్ కల్యాణ‌్ నిర్ణయించుకున్నారని అంటున్నారు.

అయితే ఇంత చేస్తన్న జనసేన అంటే తెలంగాణ బీజేపీ కి కొంత చులకన భావమే ఉందనిచెప్పొచు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరపున కీలకంగా ప్రచారం చేస్తున్న నేతల్లో ఒకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జనసేనను దారుణంగా తీసి పడేశారు. జనసేనతో పొత్తూగిత్తూ లేదన్నారు. అసలు తెలంగాణలో బీజేపీకి ఎవరితోనూ పొత్తు లేదన్నారు. అంతటితో వదిలి పెట్టలేదు. తాము వెళ్లి పవన్ కల్యాణ్‌ను మద్దతు అడగలేదని.. ఆయనే సంఘిభావం ప్రకటించారని చెప్పుకొచ్చారు. దీంతో కాక ప్రారంభమయింది. అరవింద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసైనికులు నొచ్చుకోవడం ప్రారంభించారు. బీజేపీపై ఎదురుదాడి ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: