తెలంగాణ లో కేసీఆర్ పాలనా ఇప్పటివరకు ఒకలా ఉండగా ఇప్పటినుంచి ఒకలా అందబోతుందని తెలుస్తుంది.. ఇన్ని రోజులు కేసీఆర్ కి ఎదురులేదు.. ప్రతిపక్ష నాయకులూ కూడా అంతంత మాత్రంగా నే ఉండడంతో కేసీఆర్ ఆడిందే ఆట అయిపోయింది.. కానీ ఇప్పుడు బీజేపీ కేసీఆర్ కి సరైన ప్రత్యగా కనిపిస్తుంది.. ఇప్పటికే నాలుగు ఎంపీ సీట్లు గెలవగా ఇటీవలే దుబ్బాకలోనూ కేసీఆర్ కి పెద్ద షాక్ ఇచ్చింది..ఈ గెలుపులతో బీజేపీ కి కొత్త ఉత్సాహం వచ్చినట్లయ్యింది. ఎప్పటినుంచి తెలంగాణ లో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది.. దానికి తోడు బండి సంజయ్ కూడా ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు..

కేంద్రం కూడా కేంద్రంలో తెలంగాణ బీజేపీ సభ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజల్లో మార్పుకు కారణం.. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి గా చేసి ప్రజల్లో బీజేపీ పై నమ్మకం పెరిగేలా చేసింది.. ఇకపోతే కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ లో ఏ తప్పు జరిగినా అది గత పాలకుల ఘనకార్యం అంటారు.. కేంద్రంలోని ప్రభుత్వం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అంటారు. ఇటీవలే గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ లను కలిపి ఏకిపారేశారు.

ఇదిలా ఉంటె కేంద్ర బీజేపీ కూడా కెసిఆర్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కెసిఆర్ త్వరలోనే నేషనల్ పాలిటిక్స్ కి రావాలని చూస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా కేసిఆర్ వల్ల తమకు ముప్పు ఉంటుందని భావించిన కేంద్రం మొగ్గలోనే తుడిచేయాలని పొలోమని గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వస్తుంది. నిజానికి దక్షిణాదిలో ఏ ఒక్కసార్టీ కేసీఆర్ ను భుజాలపైకి ఎత్తుకోకపోవచ్చు. నిన్నామొన్నటివరకూ మిత్రునిగా ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ సైతం ఇటీవలి కాలంలో దూరమయ్యారు. డీఎంకే అధినేత స్టాలిన్ కాంగ్రెసుతో కలిసి నడుస్తున్నారు.  ఈ స్థితిలో మూడో ఫ్రంట్ పేరిట సాగించే హడావిడి ప్రచారానికే పరిమితమవుతుందా లేదా తర్వాత కూడా కేసిఆర్ కొనసాగిస్తార అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: