గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ పార్టీ చాలా హోప్స్ పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. దుబ్బాక ఫలితం తమకు ఫేవర్ కు రావడంతో ఒక్కసారి గా తెలంగాణ లోబలమైన పార్టీ గా ఎదిగిన బీజేపీ పార్టీ ఇప్పుడు గ్రేటర్ లోనూ విజయ ఢంకా మోగించి మరింత బలపడాలని చూస్తుంది. అందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణ లో కాంగ్రెస్ ను పక్కకు తోసి రెండో స్థానానికి ఎగబాకిన బీజేపీ పార్టీ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ప్లేస్ కి ఎర్త్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీ ఆర్ ఎస్ ని గద్దె దింపి ఆ ప్లేస్ లో తమ పార్టీ ని నిలపాలన్నదే బీజేపీ ఆలోచన కాగా ఇప్పుడు గ్రేటర్ లోనూ అదే ఆశతో ముందుకు వెళుతుంది..

ఉత్తరాది పార్టీగా గుర్తింపు బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన బలపడే క్రమంలో  తన దృష్టి అంతా తెలంగాణా మీద కేంద్రీకరించింది. అసెంబ్లీ ఎన్నికల తరవాత చూసుకుంటే బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతున్న తీరు కనిపిస్తుంది.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన బీజేపీ ఒక్కో స్థానంలో బలం పెంచుకుంటూ వచ్చింది. ఇలాంటి సమయంలో అమిత్ షా రాక తెలంగాణా లో కొంత ఆసక్తి ని రేకేతిస్తుంది.. అయన ఈరోజు హైదరాబద్ లో రోడ్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..

ఈయన రాక తో బీజేపీ లో కొంత వ్యత్యాసం ఉంటుందని చెప్పొచ్చు. బీజేపీ పార్టీ గ్రేటర్ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే ఆ పార్టీ గెలవడానికి అవలంభించే విధానాలను బట్టి తెలుస్తుంది.. ఇప్పటికే రాష్ట్రంలోబీజేపీ కి ప్రజలనుంచి మద్దతు లభిస్తుంది.. ఈ మద్దతు ను తమకు అవకాశం గా మలుచుకుని గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమల దళం, ప్రచారంలోకి పార్టీ అగ్రనేతలను దింపుతోంది. అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి చరిష్మా ఉన్న నాయకులను అస్త్రాలుగా సంధించనుంది. జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న నేతలను గ్రేటర్ వార్ లోకి దిండచం ద్వారా గెలుపు తీరాలకు చేరుకోవాలనుకుంటోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: