2018  ఎన్నికల్లో  ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు..  త్వరలోనే విశాఖ కు లాంఛనంగా రాజధాని షిఫ్ట్ అయిపోతుంది. అంతా బాగుందన్న టైం లో ఈ వ్యవహారం కోర్టు కెళ్ళడం అందరికి పెద్ద తలనొప్పిగా మారింది.

అయితే ఇక్కడి పెట్టుబడులు ఎలా ఎప్పుడు వస్తాయి అనేది ఇప్పుడు కొంత గందరగోలంగా ఉంది. అయిదారేళ్ళ క్రితం నాటి సీఎం చంద్రబాబు విశాఖలో పారిశ్రామిక సదస్సుల పేరిట చాలానే హడావుడి చేసేవారు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అనుకూల మీడియాలో రాయించుకునేవారు. అయితే చివరికి ఏవీ రాలేదు కానీ ఖజానా నుంచి ఖర్చులు మాత్రం తీసి పెట్టాల్సివచ్చేది. ఇక వైసీపీ మాత్రం తాము ఇలాంటి వాటిని భిన్నమని చెప్పుకుంది. పైగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు, విజయసాయిరెడ్డి, అధికారుల సమక్షంలోనే సదస్సుని నిర్వహించి మరీ సత్తా చాటింది. సందేహాలను తీర్చడమే కాకుండా మీ పెట్టుబడులకు మా భరోసా అంటూ వైసీపీ పెద్దలు నినాదాన్ని ఇచ్చి నమ్మకం పెంచారు.

అయితే ఇక్కడ ఉద్యోగాలు వస్తే లోకల్ యూత్ కే ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే రాజధాని గా ప్రకటించిన విశాఖ లో దేశంలో నే బెస్ట్ సిటీ గా చేయడమే లక్ష్యమని చెప్తునారు. రానున్న రోజుల్లో రాజధానిగా విశాఖ అవడం ఖాయమని అందువల్ల పరిశ్రమలు వస్తే తగిన విధంగా సర్కార్ నుంచి సహాయం ఉంటుందని అంటున్నారు. అనుమతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశ్రామిక పాలసీని రూపకల్పన చేశామని, రాయితీలు కూడా ఆకర్షణీయంగా రూపొందించామని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: