మూడు రాజధానుల బిల్లు విషయంలో, సీఆర్డీయే రద్దు బిల్లు విషయంలో  ప్రతిపక్షాలు ఒప్పుకోలేదని జగన్ శాసన మండలిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.. అయితే జరిగి చాలా రోజులే అవుతుంది.. అప్పటినుంచి కరోనా వల్ల, మిగితా కొన్ని కారణాల వల్ల కేంద్రం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.. అయితే ఇప్పుడు కూడా ఈ రద్దును కేంద్రం పట్టించుకోవట్లేదని తెలుస్తుంది.. పెద్దల సభను ఇలా జగన్ రద్దు చేయడం పై కూడా కేంద్రం కొంత సీరియస్ గా ఉందని అప్పుడు వార్తలు వచ్చాయి... దాంతో జగన్ ఈ విషయం పై ఇప్పటికైనా వెనుకడువేస్తారా అని నేతలు అనుకుంటున్నారు.. శాశన సభ రద్దు చేసి కేంద్రం ఆమోదం కోసం పంపగా ఇన్నిరోజులు జాప్యం చేస్తూ వచ్చింది..

కొన్ని రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో జగన్ ఈ మండలి రద్దు విషయంలో పునరాలోచించాలని చూస్తున్నారట..అందుకు కారణాలు లేకపోలేదట..తాజాగా తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి చక్రవర్తికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఈ నేపథ్యంలో మండలిని కొనసాగించాల్సిన పరిస్థితి.. దీంతో మండలిని కొనసాగించాలని జగన్ పూర్తిగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

అయన ఒక్కడికే కాకుండా చాలామంది ఆశవాహులకు అయన ఎమ్మెల్సి మాట ఇచ్చారట.. గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ వంటి వారు జగన్ ద్వారా ఇప్పటికే హామీ పొంది ఉన్నారు. ఇలా రానున్న రోజులలో చాలా మందికి ఇక మీదట జగన్ మండలిలో పదవులు భర్తీ చేస్తారని అంటున్నారు. మొత్తానికి పునరావాస కేంద్రం అని తాను ఆరోపించినట్లుగానే జగన్ అదే బాటలో నడుస్తున్నారు అని టీడీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక మండలి విషయంలో జగన్ మడమ తిప్పేశాడు అని కూడా అంటున్నారు. ఎవరేమన్నా కూడా మండలి ఉంటే బోలెడు పదవులు వస్తాయని వైసీపీ నేతలు మాత్రం ఆనందిస్తున్నారుట. మరి మండలి రద్దు చేయకపోవడం మూడు రాజధానులపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: