గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో కాస్త ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్న సరే ప్రచారం విషయంలో అగ్ర నేతలు ఎవరూ కూడా బయటకు రాకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. చాలామంది కీలక నేతలు ఇప్పుడు అసలు ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత మంది అభ్యర్థులు టిఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.

టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో కనీసం పది మందిని తమ పార్టీలోకి తీసుకునే విధంగా టిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది అని సమాచారం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ప్రభావం చూపించి... తమ విజయం మీద దెబ్బ కొడితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వాడుకునే విధంగా టిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది.

మల్కాజ్గిరి పరిధిలో దాదాపు  ఆరుగురు అభ్యర్థులతో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరి పార్టీ మారతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు. వారిని కట్టడి చేయడానికి ఎక్కువగా కష్టపడుతున్నారు. మరి వారి పార్టీ మారతారా లేదా అనేది చూడాలి. హైదరాబాద్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఇవాళ ప్రచారం విషయంలో దూసుకుపోతున్నారు. మరి ఆ పార్టీ ఎంత వరకు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: