గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ కాస్త ఎక్కువగా దృష్టిసారించింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంత మంది నేతలు గెలిచే అభ్యర్థులతో ఇప్పటికే చర్చలు జరపటమే కాకుండా వారికి కీలక పదవులను కూడా ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరు అభ్యర్థులకు అయితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. మరి వారు పార్టీ మారతారా లేదా అనేది చూడాలి.

బిజెపి నుంచి కూడా ఇద్దరు అభ్యర్థులతో టిఆర్ఎస్ పార్టీ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ విషయంలో చాలా వరకు కూడా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. రాజకీయంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంతోకొంత ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అయితే దాదాపు ఆరు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఈ ప్రభావం ఎంత వరకు ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అయితే గెలిచే వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి 10 మంది పార్టీ మారే అవకాశం ఉండవచ్చునని భావిస్తున్నారు.

కొంతమంది టీడీపీని వీడి బయటకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రచారం విషయంలో ఘోరంగా వెనుకబడి ఉంది. కీలక నేతలు ఎవరూ కూడా ప్రచారం చేసే విషయంలో ముందుకు రావడం లేదు. మరి ఆ పార్టీ నేడు అయినా సమర్థవంతంగా ప్రచారం చేసుకుంటూ లేదా అనేది చూడాలి. అయితే ప్రచారానికి సమయం అయిపోవడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పుడు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తూ ముందుకు వెళ్తుంది ఏంటి అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక నేతలు కొందరు టిఆర్ఎస్ పార్టీ తో చర్చలు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: