డిసెంబర్ 1న జరగనున్న ఎన్నికలు నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. మరో రెండు రోజుల్లో నగరవాసులు ఓటు ద్వారా అభ్యర్థుల భవిష్యత్‌ను నిర్ణయించనున్నారు. రెండోసారి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు టీఆర్ఎస్ తీవ్రమైన కృషి చేస్తోంది. టీఆర్ఎస్‌ను ఎలాగైనా ఓడించాలని బీజేపీ సర్వశక్తులు ధారపోస్తోంది. కాంగ్రెస్ కూడా మెజార్టీ సీట్లను గెలుచుకోవాలనుకుంటోంది. మొత్తం 150 డివిజన్లలో 148 స్థానాల్లో హస్తం గుర్తు పోటీ చేస్తోంది.

టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ తామేనని చాటుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. ఎంఐఎం కూడా తమ స్థానాలను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. శనివారం చిక్కడపల్లి వివేక్ నగర్ శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మాజీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు చిట్టబోయిన ప్రభాకర్ యాదవ్ నివాసంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, గాంధీనగర్ డివిజన్ ఎన్నికల ఇన్‌చార్జి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన టీఆర్ఎస్‌కు మద్దతివ్వాలని ఆమె ప్రజలను కోరారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్‌కు 16వ స్థానంగా గుర్తింపు రావడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి ఎంతో ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో జీడీపీ, రూపాయి విలువ దారుణంగా పడిపోయారన్నారు. ప్రజలందరూ  తమ ఓటును టీఆర్ఎస్‌కే ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ నరేశ్‌ను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి అనిల్ దంపతులు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సంతోష్ యాదవ్, యువనాయకుడు ముఠా జైసింహ, మురళి యాదవ్, ఆర్యవర్ధన్, మనోరమ్య, శాలిని, తదితరులు పాల్గొన్నారు. డివిజన్‌లోని ప్రముఖ వైద్యుడు డా. విజయ్‌ కుమార్ తదితర వైద్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిశారు. గాంధీనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ నరేశ్‌ను గెలిపించాలని ఆమె వారిని కోరారు. ఆమెతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా వైద్యులను కలిశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: