లడఖ్‌ లోని భారత సరిహద్దులో చైనా కొనసాగిస్తున్న నిర్మాణ కార్యకలాపాల వార్తలపై అమెరికా చట్టసభల్లో సభ్యుడు ఒకరు ఆందోళన వ్యక్తం చేసారు. నివేదికలు నిజమైతే, ఇది బీజింగ్ నుంచి రెచ్చగొట్టే చర్య అని ఆయన అన్నారు. తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) వెంట మేలో ప్రారంభమైన సైనిక ప్రతిష్టంభనలో భారత్, చైనా తీవ్ర విభేదాలు మొదలయ్యాయి. రెండు దేశాల సైన్యాలు ఎల్‌ఐసి వెంట పెద్ద సంఖ్యలో దళాలను మోహరించాయి. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరుపక్షాల మధ్య పలు రౌండ్ల చర్చలు ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వలేదు.

"ఇది (నివేదికలు) నిజమని తేలితే, భూమిపై వాస్తవాలను మార్చడం చైనా సైన్యం చేసే మరో రెచ్చగొట్టే చర్య" అని డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి వెల్లడించారు. ఇది దక్షిణ చైనా సముద్రంలో వారి ప్రవర్తన యొక్క నమూనాకు కూడా సరిగా సరిపోతుంది. అక్కడ వారు ద్వీపాలను నిర్మిస్తున్నారని... అక్కడ వారు ఇంతకుముందు ఉన్న వాస్తవాలను మార్చడానికి ప్రయత్నిస్తారు అని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్‌ లో యుఎస్ హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ లో చేరిన తొలి భారతీయ-అమెరికన్ ఆయనే.

శాటిలైట్ చిత్రాలతో సహా నివేదికలు చైనా నిర్మాణ కార్యకలాపాల గురించి తనకు సమాచారం ఇచ్చాయని చెప్పారు. ఇటీవల వరుసగా మూడోసారి ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికైన కృష్ణ మూర్తి మాట్లాడుతూ అమెరికా భారత్‌ తో కలిసి ఉందని అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ భారతదేశానికి చిరకాల మిత్రుడు అని చెప్పాడు. ఆయనతో పాటు భారత సంతతి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కమలా హారిస్ న్యూ ఢిల్లీతో కలిసి పని చేస్తారని అన్నారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు చాలా సమర్ధవంతంగా ఉన్నాయని ప్రపంచంలో తిరుగులేని శక్తులు అని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: