హైదరాబాద్: ‘పాత బస్తీలోని కుక్కలను తరిమికొట్టాలి. మేం అధికారంలోకి వస్తే పోలీసులకు 15 నిముషాలిస్తాం. మీ సత్తా చూపించండి’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చూశారు. ఆదివారం జరిగిన ప్రెస్ అండ్ మీట్ కార్యక్రమంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

పాతబస్తీలో హిందువుల జనాభా రోజురోజుకూ తగ్గిపోతోందని.. దీనికి కారణం ఏంటనేది పాలకులే చెప్పాలని ప్రశ్నించారు. శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూడ, లాల్ దర్వాజ, గౌలిపుర, చాతార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడకి పోయారో.. ఏమైపోయారో తెలియజేయాలని నిలదీశారు. పాతబస్తీలో ఉన్న హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, విపరీతంగా కబ్జాలకు పాల్పడుతున్నారని, దీనికి కారణం ఏంటనేది బయటపెట్టాలని ప్రశ్నించారు.

పోలీసులు హీరోలాంటి వారని, తాము గెలిస్తే వారికి 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తామని, పాతబస్తీలోని పాకిస్థాన్ కుక్కలను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లకు చెందిన అక్రమ వలసదారులను, రోహింగ్యా లుచ్చాలను బయటకు గుంజి తరిమేస్తామని అన్నారు. భాగ్యనగరానికి బీజేపీయే రక్షణ కవచమని, ప్రజలంతా అది గుర్తించి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమను గెలిపించాలని పిలుపునిచ్చారు.


ఇదిలా ఉంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి ఆయన బయల్దేరారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్‌ మండి, హనుమాన్‌ టెంపుల్‌ వరకు అమిత్ షా రోడ్‌ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఆఫీసులో ఉండి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. అమిత్ షా రావడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: