ఈ మధ్యకాలంలో బలవన్మరణాలకు పాల్పడటం  అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఏ చిన్న సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవటం మానేసి ప్రస్తుతం పిరికితనంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఎన్నో తెర  మీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ప్రస్తుతం రోజురోజుకూ టెక్నాలజీ పరుగులు పెడుతుంది టెక్నాలజీ వెంట మనుషులు కూడా పరుగులు పెడుతున్నారు.. కానీ నేటి రోజుల్లో టెక్నాలజీ పెరగడం ఏమో కానీ మనుషుల్లో ఆత్మస్థైర్యం మాత్రం రోజురోజుకూ తగ్గిపోతోంది ఏ చిన్న సమస్య వచ్చిన అది పెద్ద సమస్యగా భావిస్తూ ఆందోళనలో మునిగిపోతున్నారు.



 ఈ సమాజంలో చాలా తక్కువ మందిలోనే సమస్యలను ఎదిరించే ఆత్మస్థైర్యం కనిపిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా చిన్న చిన్న సమస్యలకే ఎంతోమంది మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న  ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.  ఇటీవల నిర్వహించిన సర్వేలో ఎన్నో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. జపాన్ లో నిర్వహించిన సర్వేలో సూసైడ్ కేసు లు  రికార్డు స్థాయిలో బయటపడ్డాయి.




 ఏడాది అక్టోబర్ నెలలో జపాన్ లో నమోదైన సూసైడ్ కేసులు మొత్తంగా జపాన్లో అక్టోబర్లో కరోనా  మృతుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది అన్నది ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు ఆ దేశ నేషనల్ పాలసీ ఏజెన్సీ వెల్లడించింది. కరోనా  సంక్షోభం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని అధికార వర్గాలు వెల్లడించాయి. 2020 అక్టోబర్ నెలలో జపాన్ లో ఆత్మహత్య చేసుకునే వాళ్లం 2153 ఉంటే కరోనా  వైరస్ బారిన పడి చనిపోయిన వారు... రెండు వేల 87 మంది మాత్రమే ఉండడం గమనార్హం. ఇలా జపాన్ దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ మరణాల కంటే ఆత్మహత్యలు ఎక్కువగా ఉండడం ఆందోళన కరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: