ప్రస్తుతం భారతదేశం లో మరోసారి కరోనా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటం  ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తుంది అనే విషయం తెలిసిందే. ఓవైపు దేశంలో రికవరీ రేటు పెరిగి పోతున్నప్పటికీ మరోవైపు కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడం ఆందోళన  కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న పలు రాష్ట్రాలలో... మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేసే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి  అన్న విషయం తెలిసిందే.




 ఇక తాజాగా ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడి కోసం దేశంలో అమలులో ఉన్న నిబంధనలను మరింత సుదీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేశారు భారత వైద్య పరిశోధనా మండలి మాజీ ప్రొఫెసర్ బలరాం భార్గవ. వ్యాక్సిన్  అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ప్రజలందరూ సుదీర్ఘకాలంపాటు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన తేల్చి చెప్పారు. ఇటీవలే కోల్కతాలో కింగ్ జార్జెస్ మెడికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.




 టీకా రూపకల్పనలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అంటూ తెలిపిన ఆయన... తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకా అందించడమే తమ లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే భారత్ ప్రస్తుతం కేవలం దేశ ప్రజల కోసమే కాకుండా ఎన్నో దేశాల కోసం కూడా వ్యాక్సిన్  సిద్ధం చేస్తోంది అంటూ ఈ సందర్భంగా తెలిపాడు. అయితే ప్రస్తుతం తాము తయారు చేసే టీకా ఒంట్లో ఉన్న కరోనా వైరస్ ను అంతం చేసేది అయితే మాస్క్ క్లాత్ తో తయారు చేసిన మరో టీక అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కరోనా ను  అంతం చేయాలంటే వ్యాక్సిన్  ఒక్కటే సరిపోదని సామాజిక దూరం, మాస్క్  ధరించడం తప్పనిసరి అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: