గ్రేటర్ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం ఊపందుకుంది... కేవలం కొంత సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొంత సమయాన్ని కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలతో గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరు అభ్యర్థులు మరోసారి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రేటర్ పరిధిలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ప్రచార హోరు  కనిపిస్తోంది.



 అయితే ప్రస్తుతం ప్రచారం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ప్రధాన పార్టీల మధ్య ఇప్పటికి కూడా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. కొంత సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నేతలందరూ మరింత జోరు పెంచి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీధి వీధి తిరుగుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ప్రస్తుతం అభ్యర్థులను ఆవాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ దగ్గర ఉన్న చివరి వస్త్రాలను కూడా సంధిస్తున్నారు అభ్యర్థులు. ప్రస్తుతం టీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ సహా ఎంఐఎం నేతలు కూడా ప్రస్తుతం వీధివీధిన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.



 ప్రచారం చివరి రోజున కేంద్ర మంత్రి అమిత్ షా నగరంలో పర్యటించేందుకు సిద్దం అయ్యారు అనే విషయం తెలిసిందే. ఇక అమిత్ షా పర్యటన రాజధానిలో రాజకీయ వేడిని మరింత రాజుకుంది. అయితే ఢిల్లీ పెద్దలు గల్లీ ఎన్నికల కోసం రావడంపై అటు టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికా పర్యటన పై హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ పెద్దలను బీజేపీ తీసుకువస్తుందని.. ఓ  చిన్నపిల్లాడు  తనతో  మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కటే మిగిలి పోయారు  అంటూ అన్నాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఓవైసీ.

మరింత సమాచారం తెలుసుకోండి: