ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ప్రపంచవ్యాప్తంగా సంవత్సరం నుంచి  కరోనా వైరస్  కొనసాగుతోన్న నేపథ్యంలో  చైనా తప్ప అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం జరిగింది. 50కిపైగా దేశాలు దీవాళా తీశాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో స్టేట్ ఆఫ్ ది స్టేట్స్-2020 అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ తరుణంలో కరోనా ప్రతికూలతల నుంచి దాటుకుని వృద్ధిని సాధిస్తోన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ర్యాంకు సాధించింది. పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి, పరిపాలన, శాంతిభద్రతలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పర్యావరణం,కరోనా ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆర్థిక, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి 12 రంగాల్లో ఆయా రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిపై సర్వే  చేసి ‘ఇండియా టుడే-ఎండీఆర్‌ఏ’ తన ‘స్టేట్ ఆఫ్ ది స్టేట్స్’ ర్యాంకులను రూపొందించింది.


ఇందులో అత్యుత్తమ మెరుగైన పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక రంగం, పర్యాటక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. అప్పుడు అప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు .కాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైలెంట్‌గానే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగాల్లో ఏపీ టాప్ ర్యాంకును పొందగా, మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ కేటగిరిలో రెండో స్థానంలో నిలిచింది. 2018 లో టీడీపీ అధికారంలో వున్నప్పుడు పలు విభాగాల్లో ఎనిమిదో స్థానంలో ఉన్న ఏపీ.. జగన్ సీఎం అయిన ఏడాదికే రెండో స్థానానికి చేరడం గమనార్హం. 2020 ర్యాంకుల్లోనే ఏపీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ఆర్థికాభివృద్ధిలో టాప్‌కు చేరింది.


ఇక ఓవరాల్ గా బాగా అభివృద్ధి చెందిన పెద్ద రాష్ట్రాల ర్యాంకుల్లో తెలంగాణ ఒక ర్యాంకు కిందికి దిగజారింది. 2019లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 10వ స్థానంలో నిలిచింది. అయితే, ఓవరాల్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఏపీ 7వ స్థానం , తెలంగాణ 9 స్థానంలో  స్థానంలో నిలిచాయి. ఇక ప్రతిష్టాత్మక ‘స్టేట్ ఆఫ్ ది స్టేట్స్’ అధ్యయనంలో ఆర్థికాభివృద్ధి విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఓవరాల్ మోస్ట్ ఇంప్రూవ్డ్ రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...






మరింత సమాచారం తెలుసుకోండి: