వరదల్లో పంచిన డబ్బుల్లో 400 కోట్లు టీఆర్ఎస్ నాయకులు మెక్కారు అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సమయంలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తుంటే కేసీఆర్ విష ప్రచారం చేశారు అని ఆయన మండిపడ్డారు. బీజేపీ నాయకులను చూసి జాలిపడుతున్న అన్నారు. దేశంలో మీకు ఒక్కసారి కాదు రెండు సార్లు అవకాశం ఇచ్చాము అమిత్ షా.. అయినా మీరు ఎం చేశారు అని ఆయన నిలదీసారు. కేంద్ర హోంశాఖ మంత్రి గా ఇక్కడ వరదలు వచ్చినప్పుడు మిరే ఇక్కడికి వచ్చి నష్టాన్ని అంచనా వేయాల్సిన శాఖ మీ దగ్గర ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత వరకు చిల్లిగవ్వ కూడా ఏమి ఇవ్వలేదు అని మండిపడ్డారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తో రాష్ట్ర మంత్రులు పర్యటించాలి అలాంటిది ఎమ్మార్వో కూడా రాలేదని చెప్తున్న కిషన్ రెడ్డి ఇది ఎవరి చేతకాని తనమో చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. నిన్న ప్రధాని వచ్చి వెళ్లిపోయారు ..కనీసం ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న సభ్యుడు ని కూడా కనీసం పిలవలేదు అన్నారు. చట్టాలని మిరే ఉల్లంఘిస్తారా...? అని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణం లో పిల్లర్ కి ఇంత అని కమిషన్ ల తో టీఆరెస్ నాయకులు దోచుకుంటున్నారు అని మండిపడ్డారు. మూసి ప్రక్షాళన కోసం కనీసం ప్రణాలిక కూడా ఎందుకు చేయలేదు అని నిలదీశారు.

స్వచ్చ్ భారత్ లో ఉన్న వేల కోట్లు నిధులు ఉన్నాయి అని, మూసి ని స్వచ్చ్ భారత్ నిధుల తో ప్రక్షాళన చేయాలని లేఖ లు రాస్తే కేంద్ర ప్రభుత్వం చెత్త బుట్టలో పడేసింది అన్నారు. 20 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న నరేంద్రమోదీ చేయని పని 12 వేళా కోట్లు ఉన్న మేయర్ చేయగలడా..? అని ప్రశ్నించారు.  మేయర్ గెలిస్తే మూసి ఎన్ని వేల కోట్ల తో ప్రక్షాళన చేస్తారో ,పెండింగ్ లో ఉన్న రైల్వే పనులకు ఇన్ని కోట్లు కేటాయిస్తారు.. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న  యువత కు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారో అమిత్ షా ఎలాంటి హామీ ఇవ్వ కుండా వెళ్లిపోయారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: