గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం ప్రచారం విషయంలో వెనుకబడి ఉన్నారు అనే మాట వాస్తవం. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రచారానికి పది రోజులు గడువు మాత్రమే ఉందని ఆయన అన్నారు. శేరిలింగంపల్లి లో ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్,శేరిలింగంపల్లి ఇంచార్జి రవికుమార్ యాదవ్ ఇద్దరు పార్టీ మారడం జరిగింది అని ఆయన వెల్లడించారు.

మాకు కార్పొరేటర్ అభ్యర్థులు దోరకరని అందరూ భావించారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కానీ ప్రతి డివిజన్ నుండి ముగ్గురు, నలుగురు పోటీ పడ్డారు అని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి లో 4 సీట్లు, మహేశ్వరం లో 1, రాజేంద్రనగర్ లో 3 సీట్లు మేము గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసారు. మా పోటీ కేవలం బీజేపీ తోనే టిఆర్ఎస్ తో కాదు అన్నారు. డబ్బులు వెదజల్లి గెలవాలని టిఆర్ఎస్ చూస్తోంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రజలు అన్ని క్షుణ్ణంగా చూస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.

టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నగరం లో చేసింది ఏమి లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంలో చాలా పోస్టింగ్ లు కాళీగా ఉన్నాయి ఇప్పటికి భర్తీ చెయ్యడం లేదు అని మండిపడ్డారు. గత గ్రేటర్ ఎన్నికల్లో డబల్ బెడ్ రూమ్ ఇస్తాం అంటూ అధికారంలోకి రాగానే ఆ ఊసే లేకుండా పోయింది అని విమర్శించారు. డబల్ బెడ్ రూమ్లు అందరికి ఇచ్చే మళ్ళీ ఎన్నికల్లోకి పోతామని చెప్పి మాట తప్పారని... ఇప్పటికి మన నగరంలో ఒక్క డబల్ బెడ్ రూమ్ కూడా ప్రజలకు ఇవ్వలేదు అని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: