గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చివరి రోజున బిజెపి, తెరాస, కాంగ్రెస్ పార్టీలు కాస్త దూకుడుగా ప్రచారం చేస్తున్నాయి. రాజకీయంగా తెలంగాణాలో ఈ ఎన్నికలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించే విధంగా కీలక పార్టీలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే  నేడు ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కావడంతో దాదాపుగా నేతలు అందరూ కూడా ప్రచారంలో చాలా కీలకంగా ఉంటున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి బిజెపి, తెరాస మీద విమర్శలు చేసారు.

అవమానకరంగా ఉంది బీజేపీ ప్రవర్తన ఉంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. వరదలు వొచ్చనప్పుడు ఎక్కడికి పోయారు వీళ్లు అని ఆయన నిలదీశారు. దళిత మహిళల పట్ల అత్యాచారం చేస్తే అక్కడ ఏం చేశారు యోగి గారు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మీకు హైదరాబాద్ పెరు మార్చడం ,సర్జికల్ స్ట్రైక్ చేయడం ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా అని ఆయన నిలదీశారు. ఈ నాయకులకు హైదరాబాద్ కి ఎం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. ఒక్క రూపాయి అయిన హైదరాబాద్ కి ఇచ్చారా ఎప్పుడైనా అని ఆయన నిలదీశారు.

హైదరాబాద్ లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. పాత బస్తి లో కేంద్ర బలగాలు దింపుతారా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ వాళ్లకు బుద్ది లేకుండా మాట్లాడుతున్నారు అన్నారు. విషపూరిత ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు అని మండిపడ్డారు. బీజేపీ ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి అన్నారు. ఇకా అధికార పార్టీ 7 ఏండ్ల పాటు దోచుకున్నారు అని ఆయన విమర్శలు చేసారు. డబ్బులు పెట్టి బిర్యానిలు ఇచ్చి సభ ఏర్పాటు చేసింది టీఆరెస్ అని ఆయన మండిపడ్డారు. అసమర్థత ,అవినీతికి మారు పేరు టీఆరెస్ పార్టీ అని ఆయన విమర్శలు చేసారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అందరిని సమానంగా చూస్తుంది అన్నారు. హైదరాబాద్ ప్రజలారా ఆలోచించండి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: