తెలంగాణ ఉద్యమంలో మర్చిపోలేని రోజు ఈ రోజు అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రోజు నవంబర్ 29 కేసీఆర్ ఆమరణ దీక్షకు కూర్చున్న రోజు అని ఆయన  వ్యాఖ్యానించారు. మన కేసీఆర్ ఈ రోజు ఖమ్మం జైల్లో పడిన రోజు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన రోజు అన్నారు. ఢిల్లీ ని కదిలించి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్  దే అన్నారు. హైదరాబాద్ ను నెంబర్ వన్ గా బంగారు తెలంగాణ తీర్చిద్దిద్దిన రోజు ఈ రోజు అని ఆయన పేర్కొన్నారు. పఠాన్ చేరు ఓ మినీ ఇండియా  అన్నారు.

అయ్యా అమిత్ షా ఇక్కడ ఉండే బీహార్,గుజరాత్ ప్రజలను అడగండి... మీ గుజరాత్,బీహార్ బీజేపీ గవర్నమెంట్ ఎలా ఉంది,మన తెలంగాణ ఎట్లా ఉందో మీ ప్రజలను అడగండన్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే మా ఏడు మండలాలను ఆంధ్రలో కలిపి అన్యాయం చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. సమాధులను కూల్చే వాళ్ల దిక్కా కట్టెటోళ్ల దిక్కా అని ఆయన మండిపడ్డారు. మన హైదరాబాద్ నుం అన్ని రంగాల్లో అభివృద్ధి లో ముందుంచాలి అని మన కేసీఆర్ గారు కోరుకుంటున్నారు అన్నారు. బీజేపీ వాళ్ళు మత కల్లోలాలు చేస్తున్నారు అని ఆయన విమర్శించారు.

పేద  ప్రజలు కు లక్ష ఇండ్లు కట్టించినమన్నారు. కుమార్ యాదవ్ ను గెల్పించండి మీ ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్ పట్టాలు ఇప్పించే బాధ్యత నాదీ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ వాళ్ళు ఈ రోజు కాళ్ళు మొక్కుతున్నారు జర జాగ్రత్త అని అన్నారు. కరోనా కష్ట కాలంలో టిఆరెఎస్ ప్రభుత్వం కడుపున పెట్టుకుంది అని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో బీజేపీ అభ్యర్థి తండ్రి ,కొడుకులు మీకు కన్పించారా లేదు అదే మా గూడెం మహిపాల్ రెడ్డి ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,నేను ప్రజలకు అండగా ఉన్నామన్నారు. పేద ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పతకాలు చేపట్టిన ప్రభుత్వం టిఆరెఎస్ ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: