గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో నేతలు అందరూ కూడా ప్రచారం చేసారు. కీలక  నేతలు అందరూ కూడా ప్రచారంలో దూసుకుపోయారు. చివరి రోజు ప్రచారంలో బిజెపి నేతలు అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కీలక నేతల్లో పలువురు రాష్ట్ర సర్కార్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. తాజాగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భాగ్యనగరంలో భాజాపా జాతీయ నాయకులు ప్రచారానికి వస్తుంటే బెంబేలెత్తుతున్న కెసిఆర్ ను ప్రశ్నిస్తున్నాను అన్నారు.

ఏడాది క్రితం హుజూర్ నగర్ ఎన్నికలలో కేవలం కేవలం ఆ జిల్లాకు చెందిన వారు మాత్రమే ప్రచారంలో పాల్గొనకుండా, తెరాస ప్రభుత్వ మంత్రులందరూ ప్రచారం ఎందుకు నిర్వహించారు అని ఆయన  నిలదీశారు. బిజెపి నాయకులు ప్రచారానికి వస్తే, తెరాస ఏమి చేసిందో చెప్పుకోకుండా కెసిఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు అని ఆయన నిలదీశారు. భాజాపా నాయకులు ఎవరు కూడా సంస్కృతికి సాంప్రదాయలకు విరుద్ధంగా మాట్లాడటం లేదు అన్నారు. భాషను యాసను ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతూ తెరాస నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అని మండిపడ్డారు.

కెసిఆర్ చేతనైతే చేసింది చెప్పాలి అంతేకానీ ఎక్కువ మాట్లాడకూడదు అన్నారు. డిసెంబరు, జనవరి నెలలలో అక్కడి ఉష్ణోగ్రతలు సున్నాకు పడిపోతాయి, దాంతో చలికి అక్కడి ప్రజలు వణుకుతున్నారు అని ఆయన విమర్శించారు. అంతే కానీ కెసిఆర్ ను చూసి  ఢిల్లీ వణకటం లేదు అన్నారు. ఈ జి.హెచ్.యం.సి ఎన్నికలలో మేయర్ పీఠానికి సరిపడ సీట్లను గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఎంపీ ధర్మపురి అరవింద్ సహా పలువురు కీలక నేతలు ప్రచారంలో దూసుకుపోయారు. విమర్శలు కూడా ఘాటుగానే వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: