ఎన్నికల కమిషనర్ పార్థసారథి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో పలు సూచనలు చేసారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికలు ముగిసేవరకు జిహెచ్ఎంసి పరిధిలో మద్యం దుకాణాలు బంద్ అని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీన జ‌రిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఆయన వెల్లడించారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది అన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256,    పురుషులు 38 89637 ,    స్త్రీలు 35,76,941,   ఇతరులు 678 అని చెప్పారు.

మొత్తం వార్డుల సంఖ్య 150, పోటి చేసే అభ్యర్తుల సంఖ్య 1122 అని చెప్పారు. టి.ఆర్.ఎస్ 150, బి.జె.పి 149, కాంగ్రెస్ 146, టి.డి.పి 106, ఎం.ఐ.ఎం 51, సి.పి.ఐ 17, సి.పి.ఎం 12, రిజిస్టార్డ్ పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్రులు 415 అని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ల సంఖ్య  60, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ల సంఖ్య 30 అని చెప్పారు. మొత్తం పోలింగ్ సిబ్బంది 36,404 అని, పోలింగ్ అధికారులు 9101, సహాయ పోలింగ్ అధికారులు 9101, ఇతర పోలింగ్ సిబ్బంది 18,202 అని ఆయన తెలిపారు.

మొత్తం రిటర్నింగ్ అధికారులు 150, సహాయ రిటర్నింగ్ అధికారులు 150 అని అన్నారు. సాధారణ పరిశీలకులు 12, వ్యయ పరిశీలకులు 30 అని చెప్పారు. మైక్రో అబ్జర్వర్ లు 1700, వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 2920 అన్నారు.  మొత్తం బ్యాలెట్ బాక్స్ ల సంఖ్య 18,202 అని ఆయన వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ల కై అందిన దరఖాస్తులు 2,629 అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏవిధ‌మైన ఇబ్బందులు లేకుండా ఎన్నిక‌ల ప్ర‌క్రియ స‌జావుగా సాగింది అని ఆయన వెల్లడించారు. డిసెంబర్ 1న ఉ. 5:30గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి అని ఆయన సూచించారు. ఉ. 6గంట‌ల‌కు పోలింగ్ ఏజెంట్లు హాజ‌రుకావాలి అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: