జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తారా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వ పతనం ఈ ఎన్నికలతోనే మొదలౌతుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బి‌జే‌పి పైన ,టి‌ఆర్‌ఎస్ పైన ,నిప్పులు చేరేగారు.

వరదల్లో వందల సంఖ్యలో జనాలు చనిపోతే పరామర్శించడానికి రాని హోమ్ మంత్రి అమిత్ షా ఓట్ల కోసం వచ్చారన్నారు. బి‌జే‌పికి ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంత మంది బి‌జే‌పి నేతలు కట్ట కట్టుకుని రావడానికి ఇవి సార్వత్రిక ఎన్నికలు కావన్నారు.జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల కోసం కేంద్ర బలగాలను దింపుతారా..వరదలు వచ్చినప్పుడు బలగాలను దింపి సహాయక చర్యలు ఎందుకు చేపట్టలేదు అని ప్రశ్నించారు.

కే‌సి‌ఆర్ గురించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి ఈ ఎన్నికలే నాంది పలకనున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.గ్రేటర్ ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ ఓటమి కే‌సి‌ఆర్ కు ముందే తెలుసని చురకలంటించాడు.ఆ విషయం నిన్న జరిగిన బహిరంగ సభలో ఆయన మొఖం చూస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: