గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం గడువు ముగిసింది. సాయంత్రం ఆరు లోపు అన్నీ ప్రచారాలను బంద్ చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశాలను జారీ చేసింది. ఇకపోతే మద్యం దుకాణాలను కూడా సాయంత్రం ఆరు నుంచి డిసెంబర్ 1 సాయంత్రం వరకు మూసివేయాలని మద్యం దుకాణాలకు పిలుపు నిచ్చింది. అయితే సాయంత్రం వరకు టీఆరెఎస్ నేతలు చేసిన ప్రచారాల్లో మంత్రి ఎర్రబెల్లి చేసిన బైక్ ర్యాలీ మాత్రం చూపరులను అమితంగా ఆకట్టుకుంటుంది.



భాగ్యనగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఆరు గంటలకు లీడింగ్ లో ఉన్న పార్టీలు ప్రచారాన్ని జోరుగా చేశాయి.. ఈ మేరకు రాజకీయ నేతలు ప్రముఖ నగరాల్లో ప్రజలను ఆకర్షించడానికి ర్యాలీలు, రోడ్ షో లు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరికీ వారే అన్నట్లు పోటీని మరింత జోరుగా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ నుంచి కేటీఆర్, హరీష్ రావు తో పాటుగా, కవిత పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ అభ్యర్థులకు సపోర్ట్ గా నిలిచారు..



ఇది ఇలా ఉండగా రాష్ట్రపంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఇన్‌ఛార్జిగా ఉన్న మీర్‌పేట డివిజన్‌లో భారీఎత్తున బైక్‌ర్యాలీతో ప్రచారాన్ని నిర్వహించారు. ర్యాలీలో ముందు వరసలో బైక్‌పై వెళుతూ ప్రజలకు అభివాదం చేశారు. ర్యాలీలో డివిజన్‌వ్యాప్తంగా బైక్‌పై ప్రయాణించారు. అభ్యర్థితో పాటు భారీగా బైకులపై యువకులు ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పధకాలు ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి దోహదపడతాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ది చెందాలంటే టీఆరెఎస్ ను తప్పక గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎర్రబెల్లి చేసిన బైక్ ర్యాలీలో ఆయన బైక్ పై నిలుచొని మరి ప్రచారం చేయడం ఇప్పుడు అందరి నోట్లో నానుతుంది.. ఈ ఎన్నికల్లో ఎవరు విజయాన్ని సాధిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: