భారత్ చైనా సరిహద్దు ల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి  నెలలు గడిచి పోతున్నప్పటికీ ఇప్పటికీ కూడా సరిహద్దు ల్లో  పరిస్థితులు అలాగే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి నిషేధిత భూభాగాలను ఆక్రమించుకుని భారత్ పై ఆధిపత్యం సాధించాలి అనుకున్న చైనాకు.. భారత్  ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. భారత వ్యూహాలతో మొన్నటివరకు చైనా ఉక్కిరిబిక్కిరి అయితే ప్రస్తుతం శీతాకాలం లో గాల్వన్ లోయ  వద్ద రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నప్పటికీ  కూడా ఎక్కడ మార్పు మాత్రం రాలేదు.



 ఇరుదేశాల సైన్యాలు ప్రస్తుతం గడ్డకట్టే చలిలోనే పహారా కాస్తున్నాయి అనే విషయం తెలిసిందే.  సాధారణంగా అయితే భారత ఆర్మీ కి అలాంటి పరిస్థితుల్లో ఎప్పటినుంచో అలవాటు కానీ మొదటిసారి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చైనా ఆర్మీ భారత ఆర్మీ కి ఎదురుగా నిలబడి పహారా కాస్తూ ఉండడంతో అక్కడ ఆర్మీలో ఆరోగ్య సమస్యలు వస్తూ ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతూ ఉండటం కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉండటం లాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రోజురోజుకు చైనా ఆర్మీలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది.




 దేశం కోసం యుద్ధం చేసి ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఇలా మంచు  వాతావరణం కారణంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోవడం ఏమిటి అని ఏకంగా చైనా సైనికులు అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోలు తీసి వారి కుటుంబీకులకు కూడా పంపిస్తున్నారట చైనా సైనికులు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఏకంగా చైనా సరిహద్దుల్లో ఇంటర్నెట్ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సైనికులు చేసిన వీడియోలు తమ కుటుంబీకులకు వెళ్లకుండా ఉండేందుకు ఈ తరహా నిర్ణయం తీసుకుందని.. మళ్లీ భారత్ తో  బేరసారాలకు దిగేందుకు సిద్ధం అవుతుంది అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: