గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుంది. నేతలందరూ ప్రచారానికి స్వస్తి పలికి పోలింగ్‌ కేంద్రాలపై దృష్టిసారించారు. ఇక సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూన సాంబశివరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కంకికొడవలి గుర్తుకు ఓటేసి మస్రత్‌ జహన్‌ నయీమ్‌ను గెలిపించాలని సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూన సాంబశివరావు ఓటర్లను కోరారు. ఇక ఆదివారం మూసారంబాగ్‌ డివిజన్‌లో సీపీఐ పార్టీ అభ్యర్ధి మస్రత్‌ జహన్‌ నయీమ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. సీపీఐ పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దిల్‌సుఖ్ ‌నగర్ ‌జోన్ పరిధిలోని బీజేపీ అభ్యర్థి బొక్క భాగ్యలక్ష్మీ విసృత్త ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో మూసారంబాగ్‌ డివిజలో బీజేపీ విజయకేతనం ఎగుర వేస్తుందని ఆపార్టీ డివిజన్‌ అధ్యక్షుడు గౌర విజయ్‌కాంత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం డివిజన్‌ లోని పలుప్రాంతాలలో అభ్యర్ధి బొక్క భాగ్యలక్ష్మీ పార్టీ నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహించారు.

ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఓటేస్తే ఎంఐఎం పార్టీ వేసినట్లేనని పేర్కొన్నారు. వరద సాహయాన్ని కూడా బాధితులకు అందకుండా తమ జేబుల్లోకి నొక్కేసిన టీఆర్‌ఎస్ ‌కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని జోస్యం చేప్పారు. కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దేవేందర్, సురేందర్, రమేష్‌రెడ్డి, సందడి సురేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రాముయాదవ్, శశికాంత్, దినేష్, మురళీ, సత్యనారాయణ, భరత్, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: