ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం పూర్తయిపోయింది. గత 15 రోజుల నుంచి చాలా అట్టహాసంగా  హోరాహోరీగా కొనసాగిన వివిధ పార్టీల ప్రచారం ఈరోజు  సాయంత్రం 6 గంటలకు సమాప్తం అయ్యింది. ఇక ఎన్నికలు ప్రచారం అయిపోయింది కాబట్టి  ఈ గడువు తర్వాత ప్రచారం చేస్తే రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా ఉంటుంది. బయటి వ్యక్తులు గ్రేటర్ హైదరాబాద్  పరిధి దాటి వెళ్లాలని ఎస్‌ఈసీ ఆదేశించడం జరిగింది. డిసెంబరు 1న సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేదాన్ని ప్రకటించింది. డిసెంబరు 1న పోలింగ్‌  ఉంటుంది. అలాగే  4వ తేదీన  ఓట్ల లెక్కింపు ఉంటుంది. మంగళవారం ప్రొద్దున  7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించడం జరుగుతుంది.


జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1122 మంది అభ్యర్థులు పాల్గొనబోతున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి 150 మంది, బీజేపీ నుంచి 149, కాంగ్రెస్‌ నుంచి 146 మంది, టీడీపీ నుంచి 106 మంది, ఎంఐఎం నుంచి 51 మంది, సీపీఐ నుంచి 17 మంది, సీపీఎం నుంచి 12 మంది వీరితో పాటు 415 మంది ఇండిపెండెంట్ పోటీదారులు కూడా  ఎన్నికల బరిలో ఉన్నారు.మొత్తంగా చూసుకున్నట్లయితే  74 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కోసం  ఏర్పాట్లు చాలా అట్టహాసంగా  సాగుతున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 9,101 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కొవిడ్‌ 19 మార్గదర్శకాలకు లోబడి ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. జంగమ్మెట్‌ డివిజన్‌ పోటీలో అత్యధికంగా 20 మంది పోటీదారులు  బరిలో ఉండగా ఉప్పల్‌, బార్కస్‌, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలిచౌకి, జీడిమెట్ల ఈ ఐదు డివిజన్లలో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో  ఉన్నారు.ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: