హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి బల్దియా ఎన్నికలు హోరెత్తిస్తున్నాయి.గత ఐదు రోజులుగా ఎన్నికల ప్రచారలతో ప్రదాన పార్టీలలో పరస్పర ఆరోపణలు , దూషణలు, వివాదాలు, రాజకీయ హిట్ పెంచే మాటలతో,హోరెత్తించాయి. ఎట్టకేలకు ప్రచార పర్వం నేటితో ముగిసింది. ఈ రోజు చివరి రోజు కావడంతో ఎన్నికల హీట్‌ పీక్స్‌కు చేరేలా ప్రదాన పార్టీల అభ్యర్థులు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జెట్‌ స్పీడ్ తో‌ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

మలక్ పేట డివిజన్‌ పరిధిలో మూసారంబాగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చేకోలేకర్‌ సదాలక్ష్మీ శ్రీనివాస్‌ విస్తృత ప్రచారం చేశారు. సమగ్రాభివృద్ధి కోసం, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకు గ్రేటర్‌ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని మాజీ మంత్రులు చిన్నారెడ్డి అన్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌లు మూసారంబాగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చేకోలేకర్‌ సదాలక్ష్మీ శ్రీనివాస్‌ ఆదివారం నిర్వహించిన ప్రచార ముగింపు ర్యాలీకి వారు హజరయ్యారు. డివిజన్‌లో కార్యకర్తలతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్‌ చేకోలేకర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆపదలో పేదలకు ఎప్పుడుగా అండగా ఉన్నామని, లాక్‌డౌన్‌లో వారికి అందించిన చేయూతను ప్రజలు మరిచిపోలేదన్నారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మద్దతు తమకే ఉందన్నారు. మాటలు తప్ప చేతలు లేని టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చెయ్యిగుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో గొట్టిపర్తి శ్రీనివాస్‌గౌడ్, సంఘిరెడ్డి, చంద్రశేఖర్, లింగాల శ్రీనివాస్‌గౌడ్, సోహేల్, మహేష్, సాయిరామ్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: